TDP: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..

ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం నేతల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. పార్టీలోని సీనియర్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ టికెట్లు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరు రెండు టికెట్లకు తగ్గడం లేదు.

TDP: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..
New Update

Andhra Pradesh Elections - TDP: ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అప్పుడే హడావుడి మొదలైంది. ముఖ్యంగా టీడీపీలో టికెట్ల హడావుడి ఎక్కువైంది. ఒకే కుటుంబంలో రెండు నుంచి మూడు టికెట్ల కోసం యత్నాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్లు పొందేందుకు తమ ప్రయత్నాలను ప్రారంభించారు సీనియర్ నేతలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఫ్యామిలీ ప్యాకేజీల కోసం పట్టు పడుతున్నారు నేతలు. తమ కుమారులు, కుమార్తెలకు టికెట్లు ఇవ్వాలంటున్నారు నేతలు. మరి ఏ జిల్లాలో ఎవరెవరు టికెట్ల కోసం పట్టుబడుతున్నారో ఓసారి చూద్దాం..

శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మూడు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారట నేతలు. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్‌నాయుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా రామ్మెహన్‌నాయుడు సోదరి భవాని, టెక్కలి ఎమ్మెల్యేగా ఎర్రనాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు ఉండగా.. ఇప్పుడు అవే స్థానాలను వారు ఆశిస్తున్నారట.

ఇక రెండు టికెట్ల కోసం కిమిడి కళావెంకట్రావు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తనకు ఎచ్చెర్ల, తన అన్న కుమారుడు నాగార్జునకు చీపురుపల్లి టికెట్‌ కోసం పట్టు పడుతున్నారట. విజయనగరం జిల్లాలో రెండు టికెట్లు అడుగుతున్నారట అశోక్‌గజపతి రాజు. తనకు ఎంపీ, తన కుమార్తె అదితికి ఎమ్మెల్యే టికెట్‌ అడుగుతున్నారు అశోక్‌గజపతి రాజు.

ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం టికెట్‌ కోసం చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్‌ అడుగుతున్నారు. భీమిలి టికెట్‌ కోసం గంటా శ్రీనివాసరావు.. తన కుమారుడు రవితేజకు చోడవరం టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ ఫ్యామిలీ టికెట్ల కోసం యత్నాలు జరుగుతున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె దివ్యకు తుని టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారట. అలాగే, తన సోదరుడు కృష్ణుడుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారట. జ్యోతుల నెహ్రూ సైతం జగ్గంపేట టికెట్‌ అడుగుతున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు నవీన్‌కు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధినేతన కోరుతున్నారట నెహ్రూ.

విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్‌ కావాలని పట్టుబడుతున్నారు. అయితే, తనకు టికెట్ ఇవ్వాలని నాని తమ్ముడు చిన్ని పట్టుబడుతున్నారు. విజయవాడ ఎంపీ లేదా మైలవరం ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలని కోరుతున్నారట చిన్ని. కర్నూలు జిల్లాలో ఫ్యామిలీ ప్యాకేజీ కోసం మూడు కుటుంబాలు పోటీపడుతున్నాయని టీడీపీలో టాక్ నడుస్తోంది. తన ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు కావాలని కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కోరుతున్నారట. కర్నూలు ఎంపీ టికెట్‌ తనకు.. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ తన భార్య సుజాతకు ఇవ్వాలని సూర్యప్రకాశ్‌ రెడ్డి అడుగుతున్నారట. ఒకవేళ తన భార్యకు ఇవ్వకపోతే కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. డోన్‌ ఎమ్మెల్యే టికెట్‌ తనకు ఇవ్వాలని కేఈ ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారట. అలాగే.. తన అన్న కుమారుడు శ్యామ్‌కు పత్తికొండ టికెట్‌ ఆశిస్తున్నారు ప్రభాకర్‌ రెడ్డి.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టికెట్ అడుగుతున్నారు భూమా అఖిలప్రియ. తన కజిన్ బ్రదర్ బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ సేమ్‌ సీన్‌ కనిపిస్తోంది. రాప్తాడు టికెట్‌ కోసం మాజీ మంత్రి పరిటాల సునీత ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. తన కుమారుడుకు శ్రీరామ్‌కు ధర్మవరం టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారట సునీత. ఇక మాజీ మంత్రి జెసి దివాకర్‌ రెడ్డి అనంతపురం ఎంపీ టికెట్‌ అడుగుతుండగా.. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారట దివాకర్‌ రెడ్డి సోదరుడు ప్రభాకర్‌ రెడ్డి. ఈయన ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Also Read:

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్..

వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..

#andhra-pradesh-elections-tdp #telugu-desam-party #ap-elections #party-tickets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe