Chandra Babu Arrest Live Updates: రిమాండ్ రిపోర్టులో లోకేశ్ పేరు చేర్చిన సీఐడీ! ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేశ్ పేరును కూడా చేర్చింది By Shiva.K 09 Sep 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu Naidu Arrest Live Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేశ్ పేరును కూడా చేర్చింది Sep 10, 2023 11:58 IST CBN arrest: చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలిసే జరిగిందా? కమలం డబుల్ యాక్షన్! excerpt: అవకాశవాద రాజకీయాల్లో ఆరితేరిన బీజేపీ చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్‌లోనూ అదే వైఖరి అవలంభిస్తోంది. అసలు టీడీపీ అధినేత అరెస్టు కేంద్ర పెద్దల అనుమతితోనే జరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. story: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అవ్వడం ఏపీ, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 40ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో చంద్రబాబు మునుపెన్నడూ లేని వింత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల ఉండడం ఇప్పటివరకు పొత్తులపై ఎటు తేలకపోవడంతో ఇప్పటికే టీడీపీ డిఫెన్స్‌లోనే బ్యాటింగ్ చేస్తుండగా.. ఈ అరెస్టు ప్రజల్లో కాస్త సానుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ పెద్దల అంగీకారంతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని పెద్దలు ఇప్పటికీ జగన్‌తోనే మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. ఇటు వైసీపీ కూడా బీజేపీని ప్రత్యర్థిగానే చూడడంలేదు. చంద్రబాబుకు ఐటీ నోటిసులు.. ఈడీ ఎంట్రీతో తెలుగు తమ్ముళ్లు షాక్ తిన్నారు. అయితే ఇంతలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన కేసు. ఐటీ నోటిసులు కేంద్రానికి సంబంధించిన అంశం. ఐటీ నోటీసులతో చంద్రబాబు అరెస్ట్ అవుతారని.. సింపతి కోసం బీజేపీనే అరెస్టు చేయిస్తుందని.. తర్వాత పొత్తు పెట్టుకుందని.. సైలెంట్‌గా ప్లేటు మార్చి జగన్‌కు షాక్ ఇస్తుందని కొంతమంది భావించారు. ఎందుకంటే ఓటర్లుపై సానుభూతి అస్త్రం ఎక్కువగా పని చేస్తుంది. అందులోనూ చంద్రబాబుకు వయసు 73. ఈ ఏజ్‌లో ఆయన్ను అరెస్టు చేస్తారా అని ప్రజలు బాధ పడుతారు. ఇది టీడీపీకి ప్లస్. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటి చేస్తాయన్నది బహిరంగ రహస్యమే. ఈ విధంగా బీజేపీ ఏదో గేమ్ ప్లాన్ చేయాలని అనుకుంది. కానీ జగన్ ఊహించని విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఇరికించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు స్కామ్‌లకు అతీతుడు కాదని జగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎప్పటిలాగే బీజేపీ ద్వంద్వ వైఖరి కొనసాగుతూనే ఉంది. ఓవైపు చంద్రబాబు వ్యవహారంలో కేంద్రం ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తుండగా.. ఏపీ బీజేపీ మాత్రం ఎప్పటిలాగే టీడీపీ వెర్షన్ అందుకుంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని డైలాగులు వదులుతోంది. పొత్తులో లేకుండానే ఏపీ బీజేపీ ఎందుకింతా రియాక్ట్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. ఇటు బీజేపీతో నాలుగేళ్లుగా పొత్తులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం ఎంతగానో పరితపించిపోతున్నారు. ఆయన కోసం రోడ్డుపై పడుకొంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. మణిపూర్ అంశం, రేజర్ల నిరసనలపై నోరు విప్పని పవన్ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా సమర్థిస్తుండడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. bjp double game on chandrababu naidu arrest in skill development scam case Breaking : టీడీపీకి మరో షాక్..చర్చలకు నిరాకరించిన గవర్నర్..!! - Rtvlive.com Sep 10, 2023 09:15 IST 24 గంటల్లో కోర్టులో హాజరు పరిచాము - CID.... ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణ సమయాన్ని మినహాయించవచ్చు అని వాదించిన CID Sep 10, 2023 08:47 IST 9:45AM గంటలకు పోర్టు గెస్ట్ హౌస్ లో గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు..చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై.. గవర్నర్ తో చర్చ Sep 10, 2023 08:41 IST ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: రిమాండ్ రిపోర్టులో లోకేశ్ పేరు చేర్చిన సీఐడీ! రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్ పేరును ప్రస్తావించిన సీఐడీ Sep 10, 2023 08:32 IST స్కిల్ స్కాంలో అచ్చెన్నాయుడు పేరు..రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..!! click here for full details Sep 10, 2023 08:31 IST కోర్టు హల్ బెంచ్ వద్దకు చేరుకున్న ఏసిబి కోర్టు న్యాయమూర్తి CLICK HERE TO SEE REMAND REPORT CLICK HERE TO SEE REMAND REPORT PAGE 2 Sep 10, 2023 08:28 IST విజయవాడ సిఐడి కోర్టులో ప్రారంభమైన వాదనలు ఓపెన్ హాల్ లోనే జరుగుతున్న రిమాండ్ పై వాదోపవాదాలు. కోర్టు హల్ బెంచ్ వద్దకు చేరుకున్న ఏసిబి కోర్టు న్యాయమూర్తి. Sep 10, 2023 08:26 IST చంద్రబాబు కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ...నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబు పై నేరాభియోగం Sep 10, 2023 00:55 IST పవన్ ను అడ్డుకోవడంపై లోకేష్ ఫైర్.. జనసేన అధ్యక్షుడు @PawanKalyan గారిని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ కారణం లేకుండా, పోలీసులే అల్లరి మూకల మాదిరిగా రోడ్డుకి అడ్డంపడి పవన్ కళ్యాణ్ గారిని కదలనివ్వకుండా చేయడం దారుణం. రాజకీయ నేతలని అక్రమంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం.… — Lokesh Nara (@naralokesh) September 9, 2023 Sep 10, 2023 00:54 IST మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. అనుమంచిపల్లిలో మీడియా తో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు#HelloAP_ByeByeYCP pic.twitter.com/1vBNnjrCpo — JanaSena Party (@JanaSenaParty) September 9, 2023 Sep 10, 2023 00:53 IST పోలీస్ వాహనంలో పవన్, నాదెండ్ల తరలింపు.. పోలీసు వాహనంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు#HelloAP_ByeByeYCP pic.twitter.com/zFx41DPYJf — JanaSena Party (@JanaSenaParty) September 9, 2023 Sep 10, 2023 00:53 IST క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది.. క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది - శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు.. •శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తారని మేమేమీ… — JanaSena Party (@JanaSenaParty) September 9, 2023 Sep 10, 2023 00:49 IST చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చంద్రబాబు రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన తరువాతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. రిమాండ్ రిపోర్ట్ తీసుకుని మళ్లీ రావాలని న్యాయవాదులకు జడ్జి సూచించారు. Sep 10, 2023 00:16 IST ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రిమాండ్ రిపోర్ట్ కోసం న్యాయవాదులు ఎదురు చూస్తుండగా.. పోలీసులతో వారికి వాగ్వాదం చోటు చేసుకుంది. Sep 10, 2023 00:06 IST చంద్రబాబు అరెస్ట్‌పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు.. ఏసీబీ కోర్టు జడ్జి ఇంటికి వెళ్లిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. ఆయన అరెస్ట్‌పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ పోలీసులు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో కాలేదని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ముందుగా నోటీసులు ఇవ్వలేదని తమ వాదనలు వినిపించారు. చంద్రబాబును చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు లాయర్లు అంటున్నారు. ఇంకా తమకు రిమాండ్ రిపోర్ట్ అందలేదని జడ్జికి తెలియజేశారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కీలకంగా మారిన రిమాండ్ రిపోర్ట్. చంద్రబాబు రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలని జడ్జిని కోరారు న్యాయవాదులు. Sep 10, 2023 00:01 IST చంద్రబాబుకు బెయిలా? జైలా? Sep 09, 2023 23:56 IST వర్షం పడుతుండటంతో కారు పై నుంచి దిగిన పవన్.. https://rtvlive.com/wp-content/uploads/2023/09/WhatsApp-Video-2023-09-09-at-11.48.58-PM.mp4"> Sep 09, 2023 23:41 IST పోలీసుల తీరును నిరసిస్తూ నడి రోడ్డుపై పడుకున్న పవన్ అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన జనసేనాని, మంగళగిరి కార్యాలయం వెళ్లి తీరుతానని @PawanKalyan గారి నిర్ణయం#HelloAP_ByeByeYCP pic.twitter.com/QU0V6iGYDj — JanaSena Party (@JanaSenaParty) September 9, 2023 Sep 09, 2023 22:56 IST హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన టిడిపి లీగల్ సెల్ సభ్యులు హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన టిడిపి లీగల్ సెల్ సభ్యులు. ఏసిబి కోర్టు జడ్జి నివాసానికి బయల్దేరిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు. Sep 09, 2023 22:52 IST పోలీసులు అడ్డుకోవడంతో నడిచి వెళ్తున్న పవన్ కల్యాణ్ నడచి మంగళగిరి చేరుకోవాలని శ్రీ @PawanKalyan గారి నిర్ణయం pic.twitter.com/IPwd01slhz — JanaSena Party (@JanaSenaParty) September 9, 2023 Sep 09, 2023 22:22 IST జగ్గయ్యపేట వద్ద పవన్ ను అడ్డుకున్న పోలీసులు.. జగ్గయ్యపేట దాటిన తరవాత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నిలిపివేసిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు, శ్రేణులు pic.twitter.com/7zp0RSoKm2 — JanaSena Party (@JanaSenaParty) September 9, 2023 Sep 09, 2023 22:20 IST ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి వీసా, పాస్ పోర్ట్ కావాలేమో.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఏపీకి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆంధ్ర ప్రదేశ్ రావడానికి వీసా, పాస్ పోర్ట్ కావాలేమో' అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. pic.twitter.com/HV8ktDSwkN — Manohar Nadendla (@mnadendla) September 9, 2023 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి