ఏలూరులో కిడ్నీ రాకెట్ దందా గుట్టురట్టు.. బాధితులకు డబ్బులు ఇవ్వని బ్రోకర్..

ఏపీలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా కిడ్నీ రాకెట్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆధార్ కార్డులో పేర్లు మార్చి మరీ కిడ్నీలు కొట్టేస్తున్నారు కొందరు దుండగులు. ఇటీవల ఓ మహిళకు ఏడు లక్షలు ఇస్తామని చెప్పి బేరం చేసుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత కిడ్నీ తీసుకుని చివరకు ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ గ్యాంగ్‌ గుట్టురట్టయ్యింది.

New Update
ఏలూరులో కిడ్నీ రాకెట్ దందా గుట్టురట్టు.. బాధితులకు డబ్బులు ఇవ్వని బ్రోకర్..

andhra-pradesh-eluru-women-sells-kidney-for-rupees-7-lakh-receives-only-rs-5-lakh-mediator

ఆంధ్రప్రదేశ్ లో వరుస కిడ్నీ రాకెట్‌ దందాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నామధ్య విశాఖ కిడ్నీ రాకెట్‌ అరాచకాలు మరవకముందే.. అదేకోవకు చెందిన మరో ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా బట్టబయలైంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుని కిడ్నీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. వారిని టార్గెట్‌ చేసి డబ్బులు ఎరగా చూపి కిడ్నీ రాకెట్ ముఠా చేస్తున్న దందా ఆధారాలతో బయటపడింది. ఏలూరు, విజయవాడల్లోని ప్రవేట్ ఆసుపత్రుల్లో సర్జరీ చేయిస్తున్నారు. తాజాగా.. ఏలూరు నగరానికి చెందిన అనురాధ అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. జీవనోపాథి కోసం కూరగాయలు వ్యాపారం చేసుకుంటుంది. దీంతో మహిళ అప్పులు పాలైంది. మహిళ ఆర్ధిక పరిస్థితిని అదునుగా తీసుకుని ఓ వ్యక్తి రంగంలోకి దిగిన కిడ్నీ బ్రోకర్ అవతారమెత్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. బాధితురాలి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని నీకు ఉన్న రెండు కిడ్నీల్లో ఒకటి అమ్మితే ఏడు లక్షల డబ్బులు వస్తాయి.. అప్పుల బాధ తీరి సుఖంగా బతక వచ్చు అంటూ ఆశ చూపాడు. అమాయకత్వాన్ని, ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని మాయ మాటలు చెప్పి మహిళను కిడ్నీ రాకెట్‌లోకి లాగాడు.

గుట్టుచప్పుడు కాకుండా ఇంటి పేరు మార్చి, ఓ మహిళను కన్‌ఫ్యూజ్‌ చేసి కిడ్నీ దోచేసింది కిడ్నీ గ్యాంగ్‌. ముందుగా కిడ్నీ కొనుగోలు చేసే వ్యక్తి భార్యగా ఆ మహిళ ఆధార్ కార్డులోని ఇంటి పేరును మార్చారు. ఆ వ్యక్తి భార్యగా దొంగ ఆధార్ కార్డును సృష్టించారు. అయితే.. ముందుగా మహిళ కిడ్నీకి ఏడు లక్షలు ఇస్తామని చెప్పి బేరం చేసుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత కిడ్నీ తీసుకుని చివరకు ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు లక్ష రూపాయలు తన మెడికల్ ఖర్చులకు అయ్యాయని బాధిత మహిళా లోబోదిబోమంటోంది.

మిగిలిన డబ్బులు ఇవ్వమని అడిగితే తనను ఇబ్బందులకు గురిచేసి పరార్ అయ్యారని ఆ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. కిడ్నీ పోగొట్టుకున్న తాను అనారోగ్యం బారిన పడ్డానని.. కనీసం తనను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతోంది. ఓ వైపు కిడ్నీ పోయి ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు ఆధార్ కార్డు లో ఇంటి పేరు మారడంతో ప్రభుతం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నానంటోంది. కిడ్నీ పోయి.. అనారోగ్యం పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నానని, న్యాయం చేయాలని వేడుకుంటోంది. అ క్రమంలోనే.. పోలీసులను ఆశ్రయించింది అనురాధ. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు .

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీడీపీ హైకమాండ్ కు భూమా అఖిల ప్రియ వార్నింగ్!

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు.

New Update

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానానికి అఖిలప్రియ అల్టిమేటం ఇచ్చారు. మాకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే.. ఊర్లో అడ్డుపెట్టనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి పదవులు ఇప్పిస్తామన్నారు అఖిలప్రియ. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే పదవులివ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment