Pawan : అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి: డిప్యూటీ సీఎం పవన్ స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. By Jyoshna Sappogula 25 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pawan kalyan: అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రష్యాకు చెందిన వ్యోమగామి శ్రీ సెర్గి కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో నేడు జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసినా అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ ను చూపించి దాని పనితనాన్ని వివరించారు. Also Read: దారుణం.. ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడిపై పెట్రోలు పోసి.. • స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలి.. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జి ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డా. కేశన్ కోరారు. స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. • రష్యా వ్యోమగామికి సత్కారం ఈ సందర్భంగా వ్యోమగామి శ్రీ సెర్గి కోర్సకొవ్ ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ -3 రాకెట్ నమూనాను బహుకరించారు. శ్రీ సెర్గి ఆరు నెలలపాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి విశేషాలను, అంత కాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి