గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం వైఎస్ జగన్

గ్రామాల్లో దాగివున్న ఆణిముత్యాలను గుర్తించి దేశానికి అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

New Update
CM Jagan: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: గ్రామాల్లో దాగివున్న ఆణిముత్యాలను వెలికితీసి దేశానికి అందిస్తామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆడుదాం ఆంధ్ర' పోటీ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభవుయ్యాయి. మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో సీఎం జగన్ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే ఓ మైలు రాయి అన్నారు. ఈ రోజు నుంచి 47 రోజుల వరకూ ఊరూరా పోటీలు జరుగుతాయని తెలిపారు. అందరూ పాల్గొనే ఓ గొప్ప పండుగ ఈ ఆడుదాం ఆంధ్ర అని సీఎం చెప్పుకొచ్చారు. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం జగన్ క్రీడాకారులతో ముచ్చటించారు. అనంతరం క్రికెట్ బ్యాటింగ్ చేశారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేశారు.


రోజాకు క్రికెట్ నేర్పిన సీఎం జగన్..

'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం జగన్.. ఆమెతో క్రికెట్ బ్యాట్ పట్టించి పాఠాలు నేర్పించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీంతో ఆమె కూడా జగన్ చెప్పిన విధంగా బ్యాటింగ్ చేస్తూ హల్‌చల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read:

ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ..!

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

Advertisment
తాజా కథనాలు