/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Train-Accident-in-Andhra-Pr-jpg.webp)
Vizianagaram Train Accident: విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే, ఏపీకి చెందిన వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం అందుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతులైతే.. రూ. 2 లక్షల పరిహారం ఏపీ ప్రభుత్వం తరఫున అందిస్తామని ప్రకటించారు సీఎం జగన్. ఇక తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 చొప్పున సహాయం ప్రకటించారు.
మృతుల్లో ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం
ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 29, 2023
కేంద్ర మంత్రి ట్వీట్..
మరోవైపు ఈ రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు సీఎం జగన్. ఇక ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. రైలు దుర్ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి.
Rescue operations are underway. All passengers shifted. PM @narendramodi Ji reviewed the situation. Spoke to the CM of Andhra Pradesh, state govt and railway teams are working in close coordination.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 29, 2023
మంత్రి బొత్స సత్యనారాయణ పర్యవేక్షణ..
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాద స్థలికి చేరుకుని.. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసమైన చర్యలను తీసుకుంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు 14 అంబులెన్స్‌లు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read:
అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..