Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సీఎం జగన్. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు తాడెపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ..
New Update

CM YS Jagan Tirumal Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) ఇవాళ(సోమవారం) తిరుపతి(Tirupati)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సీఎం జగన్. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు తాడెపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 3.50 గంటలకు తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యూమెంట్స్‌ని అందిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు సీఎం జగన్. అనంతరం నేరుగా తిరుమలకు పయనమవుతారు. సాయత్రం 5.40 గంటలకు తిరుమలలో వకుళమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు సీఎం జగన్. అక్కడి నుంచి పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి 7:45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తారు సీఎం జగన్. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొని రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. మరుసటి రోజు తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు పాటు వైభవంగా సాగనున్నాయి. ఇవాళ అంటే సోమవారం సాయంత్రం 6:15 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం అవుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. ఇక రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు పెద్దశేషవాహనంపై ఊరేగనున్నారు.

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. ఆ వినాయకుడి ఆశీర్వాదం రాష్ట్రంపై ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగి, అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉండాలని కోరారు.

Also Read:

Ganesh Chaturthi 2023: వెయ్యేళ్ల క్రితం వెలసిన గణేషుడు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..

Watch Video: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టిన మిలిటరీ జెట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe