AP Assembly: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం.. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న సర్కార్..

ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్‌తో సభ ప్రారంభం కానుంది. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సభలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లులను ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది.

AP Assembly Meet: నేడు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు
New Update

Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్‌తో సభ ప్రారంభం కానుంది. ఇవాళ శాసనసభలో(Assembly) ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సభలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లులను ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అలాగే బుడగ జంగాల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీర్మానం చేయనుంది. ఇవాళ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన నేపథ్యంలో.. అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

అసెంబ్లీలో టీడీపీ నేతల తీరుపై మంత్రుల ఆగ్రహం..

నేటి సభకు 9 బిల్లులు..

ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో 9 బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు, ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లు, ఏపీ రవాణా వాహనాలు పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఏపీ భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లు, హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది అసెంబ్లీ. అలాగే, బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది అసెంబ్లీ. దాంతో పాటు అసెంబ్లీలో మహిళా సాధికారత, అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వే పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి:

కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe