ACB Court Rejects Chandrababu Petition: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు(chandrababu) ఏసీబీ కోర్టు(ACB Court) బిగ్ షాక్ ఇచ్చింది. చంద్రబాబు రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన తరువాతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. రిమాండ్ రిపోర్ట్ తీసుకుని మళ్లీ రావాలని న్యాయవాదులకు జడ్జి సూచించారు.
ఇదిలాఉంటే ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ముందు ఉద్రిక్తల నెలకొంది. న్యాయవాదులు జడ్జి ఇంటి ముందు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు న్యాయవాదులు. రిమాండ్ రిపోర్ట్ తాము ఎదురు చూస్తున్నామని, తమ గోడును వెల్లబోసుకునేందుకు జడ్జి ఇంటి ముందు ఉన్నామంటూ న్యాయవాదులు అన్నారు. పోలీసుల తీరుపై లాయర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. దాదాపు 7 గంటలుగా చంద్రబాబును విచారిస్తూనే ఉన్నారు సీఐడీ అధికారులు. చంద్రబాబు విచారణ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ విచారణ తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read:
Chandrababu Arrest: అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే పడుకున్న పవన్ కల్యాణ్..