Anasuya Sengupta: 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా రికార్డు సృష్టించారు. బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్‌స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'షేమ్‌లెస్' చిత్రానికి గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో, అనసూయ ఒక సెక్స్ వర్కర్‌గా నటించింది.
ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనసూయ సేన్‌గుప్తా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. అనసూయ తన అవార్డును గే కమ్యూనిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాల ధైర్యసాహసాలకు అంకితం చేసింది. అవార్డు అందుకున్న అనంతరం ఆమె చేసిన ప్రసంగంలో, 'అందరికీ సమానత్వం కోసం పోరాడేందుకు మీరు స్వలింగ సంపర్కులు కానవసరం లేదు. మనం చాలా చాలా మంచి మనుషులుగా ఉండాలి అంటూ తెలిపింది.