Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ గా అనసూయ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే ఎన్నో సినిమా ఛాన్స్ లు అందుకుంటూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. రంగస్థలంలో (Rangasthalam) రంగమ్మత్తగా కారెక్టర్ చేసి బాగా పాపులర్ అయింది. స్మాల్ స్క్రీన్ వదిలేశాక కాస్త దూకుడు తగ్గిందని అనిపించినా వస్తున్న పాత్రలతో తానేంటో నిరూపించుకుంటుంది.
Also Read: అద్దాన్ని చూసి ఉలిక్కిపడిన ఎలుగుబంటి..ఆదివారాల్లో నా రియాక్షన్ ఇంతే అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్.!
ఈ మధ్య ప్రతి సినిమాలోనూ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది నటి అనసూయ. ఇచ్చిన ఎలాంటి పాత్రలైనా కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టి మెప్పిస్తుంది. అయితే, తాజాగా, నటి అనసూయ (Anasuya) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా అయ్యాక జరిగే పార్టీలకు దూరంగా ఉండబట్టే హీరోయిన్ అవకాశాలు చేజారాయని తెలిపింది. పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయనుకుంటే, అటువంటి వాటిని తాను ప్రోత్సహించనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ టాలీవుడ్ లో కాకరేపుతున్నాయి.
అంతే కాకుండా, పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కి సంచలన విజయాన్ని అందుకున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ఓ పాటలో నటించే అవకాశం ఎందుకో వదులుకుందో కూడా చెప్పింది. ఆ సినిమాలో చాలామంది హీరోయిన్లు ఉన్నారని, ఆ గుంపులో తానూ ఒకరిగా నటించడం ఇష్టంలేక ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు చెప్పారు. తనకంటూ ప్రత్యేకత కోరుకున్నాను కాబట్టే ఆ పాటలో నటించేందుకు నో చెప్పానని పేర్కొన్నారు.
తనలో చాలా మార్పు వచ్చిందని, ఎలాంటి పాత్రలోనైనా గుర్తింపు తెచ్చుకోగలననే నమ్మకం కలిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి ఇళ్లలోని మహిళలను తలచుకుంటే తనకు జాలివేస్తుందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన నుంచి స్ఫూర్తి పొందేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారని అనసూయ పేర్కొంది.
Also Read: బిగ్ బాస్ స్టేజ్ పై ‘దాయి దాయి దామ్మ’ పాటకు స్టెప్పులేసిన రాఘవ లారెన్స్..!