Ananthapuram: అనంతలో హైటెన్షన్‌..గోరంట్ల హౌస్‌ అరెస్ట్‌!

అనంతపురం జిల్లా(Ananthapuram)లో హైటెన్షన్‌ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

New Update
Ananthapuram: అనంతలో హైటెన్షన్‌..గోరంట్ల హౌస్‌ అరెస్ట్‌!

MP Gorantla Madhav:అనంతపురం (Ananthapuram)జిల్లాలో హైటెన్షన్‌ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

‘‘జ‌గ‌న్.. నీ పుట్టుకే త‌ప్పుడు పుట్టుక‌..’’ అంటూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ..వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రాయదుర్గం బహిరంగ సభలో జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అతి దారుణంగా మాట్లాడారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ విజయమ్మను కించపరిచారని.. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా? అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదని...ముక్కు నేలకు రాసి ..వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు,సమావేశాలు,రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే అనంతపురం జిల్లాలో పర్యటన చేపట్టారు. గుంతకల్ నియోజకవర్గాల్లో బాబు ష్యురిటీ, భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుత్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటామంటూ ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

మరోవైపు ఎలాగైన చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని గుత్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధీమ వ్యక్తం చేస్తున్నారు. బాబూ ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గుత్తిలో విజయవంతంగా నిర్వహిస్తామంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు గ్యారెంటీ అంటున్నారు.రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమంటున్నారు. అయితే,ఎంపీ వార్నింగ్‌తో గుత్తిలో ఉద్రిక్తత వాతవారణం నెలకొనే ఛాన్స్‌ కనిపిస్తోంది.ఎప్పుడు ఏమీ జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారు.

Also Read: విశాఖలో ఉదయం నుంచి కుండపోత..ఇళ్లకే పరిమితమైన నగరవాసులు!

Advertisment
తాజా కథనాలు