AP: జగన్‌పై విమర్శలు కాదు.. రాష్ట్రంలో జరుగతున్న హింసను అరికట్టండి: ZP చైర్మన్

కూటమి ప్రభుత్వం జగన్‌పై విమర్శలు చేయడం కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు అనంతపురం ZP చైర్మన్ బోయ గిరిజమ్మ. ఏపీలో జరుగుతున్న దాడులను, హింసను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నారు.

AP: జగన్‌పై విమర్శలు కాదు.. రాష్ట్రంలో జరుగతున్న హింసను అరికట్టండి: ZP చైర్మన్
New Update

Ananthapur: ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై అనంతపురం జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ స్పందించారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంగా శ్వేత పత్రాలు విడుదల చేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అనేక దాడులను, హింసను అరికట్టే విధంగా పాలన చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ పబ్బం కడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అని జెడ్పి చైర్ పర్సన్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారని అయితే ప్రస్తుతం పాలక పక్షంలో ఉన్నప్పుడు మహిళలు, అమ్మాయిలపై దాడులు జరుగుతుంటే ఏ మాత్రం స్పందించకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళ హోం మినిస్టర్ సైతం ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలపై ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చట్ట ప్రకారం వీటిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా వ్యవహరిస్తే తాము కూడా సహకరిస్తామని అనంతపురం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అభిప్రాయపడ్డారు.

#ananthapur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe