Ambani Pre Wedding: అనంత్ అంబానీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. గెస్టులకు ఆ కండీషన్..?

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుకలు లగ్జరీ యాచ్ క్రూయిజ్‌ లో గ్రాండ్ గా ముగిశాయి. అయితే ఈ క్రూయిజ్‌ పార్టీలో సెల్ ఫోన్‌లు అనుమతించలేదట. ఈవెంట్ గోప్యత కోసమే అంబానీ ఈ షరతు విధించినట్లు తెలుస్తోంది.

Ambani Pre Wedding:  అనంత్ అంబానీ సెకండ్  ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. గెస్టులకు ఆ కండీషన్..?
New Update

Ambani Pre Wedding: ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. జామ్‌ నగర్‌లో అట్టహాసంగా జరిగిన వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అంబానీ వేడుకలే దర్శనమిచ్చాయి.

లగ్జరీ క్రూయిజ్ లో అంబానీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు

ఇదిలా ఉంటే.. జామ్‌నగర్‌లో మూడు రోజుల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ తర్వాత, తాజాగా అంబానీ కుటుంబం క్రూయిజ్‌లో రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ లగ్జరీ క్రూయిజ్ లో మే 30న ఇటలీలో ప్రారంభమైన  ప్రీ వెడ్డింగ్ వేడుకలు జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిశాయి. ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 300 మంది VIPలను, బాలీవుడ్ స్టార్స్ ను అతిథులుగా ఆహ్వానించారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి సింగ్ ధోని, హీరో రణబీర్ కపూర్, నటి అలియా భట్ ఈ పార్టీలో పాల్గొన్నారు.

సెల్ ఫోన్‌లు అనుమతిలేదు

అయితే జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్ పార్టీలో అనంత్- రాధికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఈసారి లగ్జరీ క్రూయిజ్ లో జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా కనిపించలేదు. దీనికి కారణం ఇదేనట.. ఈ లగ్జరీ క్రూయిజ్‌లోని వేడుకల్లో సెల్ ఫోన్‌లకు అనుమతించలేదట. అంతే కాదు ఫోటోలను పోస్ట్ చేయవద్దని అంబానీ కుటుంబం అతిథులను కోరినట్లు పలు కథనాలు చెబుతున్నాయి. ఈవెంట్ గోప్యత కోసమే ఈ షరతు విధించినట్లు తెలుస్తోంది. అలాగే  భద్రతా కారణాల దృష్ట్యా కూడా అలా చేయమని కోరినట్లు సమాచారం. అంబానీ - రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి చేసుకోనున్నారు.

Also Read: OMG Movie: నవ్వులే నవ్వులు.. జూన్ 14న వచ్చేస్తున్న వెన్నెల కిషోర్ ‘OMG’

#ambani-pre-wedding
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి