Watch Video: 'ఏయ్.. భూమి రాసిస్తావా? చంపేయమంటావా?'.. మంత్రి అనుచరుడి బెదిరింపులు..

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషశ్రీ అనుచరులు బరితెగించారు. సామాన్యులపై తమ ప్రతాపం చూపుతున్నారు. భూమి కోసం చంపడానికి సైతం వెనుకాడటం లేదు. ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. వీరి బెదిరింపులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ.. మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అనుచరుడు. ప్రభుత్వం తమదే అన్న ధైర్యంతో రెచ్చిపోయాడో మరే కారణమో గానీ.. భూమిని కబ్జా చేసేందుకు ఓ కుటుంబాన్ని బెదిరించారు.

New Update
Watch Video: 'ఏయ్.. భూమి రాసిస్తావా? చంపేయమంటావా?'.. మంత్రి అనుచరుడి బెదిరింపులు..

Anantapur ZPTC Manjunath Warning: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషశ్రీ(Minister Usha Sri) అనుచరులు బరితెగించారు. సామాన్యలపై తమ ప్రతాపం చూపుతున్నారు. భూమి కోసం చంపడానికి సైతం వెనుకాడటం లేదు. ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. వీరి బెదిరింపులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ.. మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అనుచరుడు. ప్రభుత్వం తమదే అన్న ధైర్యంతో రెచ్చిపోయాడో మరే కారణమో గానీ.. భూమిని కబ్జా చేసేందుకు ఓ కుటుంబాన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు.

'భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే పీకేది పీకుతాం, చంపేది చంపుతాం. వెయ్యి మంది కాదు లక్ష మంది వచ్చినా వదిలిపెట్టేది లేదు.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు మంజునాథ్. ఇదే లాస్ట్ వార్నింగ్ అని, భూమి రిజిస్ట్రేషన్ చేయించకుంటే.. ఇక చెప్పేది లేదు చేసి చూపిస్తాం అని భయబ్రాంతులకు గురి చేశాడు. చింతర్లపల్లి సమీపంలోనే నీ తమ్ముడిని గుద్ది చంపేవాడనని, తృటిలో తప్పించుకుని బతికిపోయాడు అని అనడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు..

శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌ కుటుంబానికి 100 ఎకరాల స్థలం ఉంది. ఇటీవల సుధాకర్‌ను కిడ్నాప్ చేసి 21 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మంజునాథ్. ఈ క్రమంలో ప్రాణభయంతో గ్రామం వదిలిపెట్టి వేరేదగ్గర తలదాచుకున్నారు సుధాకర్, అతని కుటుంబ సభ్యులు. మిగిలిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకుంటే చంపుతామని బెదిరిస్తున్నారంటూ సుధాకర్ కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుమీదే గుద్ది చంపుతానంటూ బెదిరిస్తున్న మంత్రి అనుచరుడు..

Also Read:

Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

Hyderabad: బాబోయ్.. బంగారు కొండలు, వెండి గుట్టలు.. మ్యాటర్ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Advertisment
తాజా కథనాలు