Anant Ambani Car Collection: అనంత్ అంబానీ కార్ల కలెక్షన్స్...వాటి ధరలు తెలుస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

అనంత్ అంబానీకి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. బెంట్లీ బెంటెగా , రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రీమియం, లగ్జరీ ఫీచర్లతో వస్తాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. ఈ కార్ల గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Anant Ambani Car Collection: అనంత్ అంబానీ కార్ల కలెక్షన్స్...వాటి ధరలు తెలుస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

Anant Ambani Car Collection:  దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మామూలుగా ఉండదు. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇప్పుడు దేశంలో మొత్తం వీరి పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. అంబానీ కుటుంబ సభ్యుల గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ వివాహంతో బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంత్ కార్ల కలెక్షన్స్ చూస్తే మీరు నోరెళ్ల బెట్టడం ఖాయం. అనంత్ అంబానీ కార్ల కలెక్షన్ గురించి ఇప్పుడు తెలసుకుందాం.

బెంట్లీ బెంటయ్గా:
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని కార్ కలెక్షన్‌లో కోట్ల విలువైన బెంట్లీ బెంటాయ్‌గా ఉంది. ఈ కారు 4.0 లీటర్ V8 ఇంజన్‌తో వస్తుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్, 770 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 4.10 కోట్ల ఎక్స్-షోరూమ్ ముంబై నుంచి ప్రారంభమవుతుంది.

publive-image

బెంట్లీ కాంటినెంటల్ GT ఫ్లయింగ్ స్పర్:
సెడాన్ సెగ్మెంట్లో వచ్చే ఈ కారును అనంత్ అంబానీ కూడా ఉపయోగిస్తున్నారు. ఈ వాహనం గరిష్టంగా 285 kmph వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఇంజన్ 660 Nm టార్క్, 410 bhp (వేరియంట్‌ను బట్టి) శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్:
రోల్స్ రాయిస్ ఈ ప్రీమియం కారు 6749cc ఇంజన్‌తో వస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 563బిహెచ్‌పి పవర్, 900ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 460 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది.

ఫెరారీ SF90 స్ట్రాడేల్:
ఫెరారీ SF90లో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్ ఉంది. ఇది 986 bhp శక్తిని, 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఫీచర్లతో వస్తున్న ఈ కారు ధర రూ.8.99 కోట్ల నుంచి మొదలవుతుంది.

ఇది కూడా చదవండి: ఆరు పదుల వయస్సులోనూ తరగని అందం..కొడుకు ప్రీవెడ్డింగ్ లో నీతా అందానికి నెటిజన్లు ఫిదా.!

BMW i8:
అనంత్ అంబానీ వద్ద రూ. 2.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన BMW కంపెనీకి చెందిన సూపర్‌కార్‌ BMW i8 ఉంది.

publive-image

మెర్సీడేజ్ బెంజ్ G63 AMG
అనంత్ అంబానీ నడిపే కార్లలో, మెర్సిడెస్ శక్తివంతమైన SUV Mercedes-Benz G63 AMG కూడా ఉంది, దీని ధర సుమారు రూ. 2.5 కోట్లు.

publive-image

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్:
అనంత్ అంబానీ ల్యాండ్ రోవర్ శక్తివంతమైన SUV రేంజ్ రోవర్ వోగ్‌ ఉంది. ఇది భారతదేశంలోని ధనవంతులకు ఇష్టమైనదిగా చెబుతుంటారు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ధర రూ.2.3 కోట్లు.

publive-image

సెడాన్ మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్:
అనంత్ అంబానీకి లగ్జరీ సెడాన్ మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ ఉంది. దీని విలువ రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ. అంబానీ కుటుంబానికి మెర్సిడెస్ బెంచ్ నుండి అనేక విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

publive-image

Advertisment
తాజా కథనాలు