Anand Deverakonda Movie: "డ్యూయెట్" తో ఆనంద్ దేవరకొండ..!

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా "డ్యూయెట్" ఈ సినిమాలో ఆనంద్ హీరోగా, రితిక హీరోయిన్ గా నటించనున్నారు. ఈరోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోస్ లో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

New Update
Anand Deverakonda Movie: "డ్యూయెట్" తో ఆనంద్ దేవరకొండ..!

Anand Deverakonda Movie: రీసెంట్ గా SKN నిర్మాతగా సాయి రాజేష్ దర్శకత్వంలో విడుదలైన 'బేబీ' మూవీ ఆనంద్ దేవరకొండకు తన కెరియర్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. 'బేబీ' లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తో హిట్ కొట్టిన ఆనంద్ ప్రస్తుతం మరో సినిమాకు సిద్ధమయ్యారు.

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "డ్యూయెట్" ఈ సినిమా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. సినిమాలో ఆనంద్ హీరోగా, రితిక హీరోయిన్ గా నటించనున్నారు.

publive-image

ఈరోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోస్ లో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్,హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు హరీష్ రావు సినిమాకు క్లాప్ కొట్టారు. ఇక సినిమా ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటీ చేశారు.

publive-image

సినిమా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. స్టూడియో గ్రీన్ సంస్థలో  జ్ఞానవేల్ రాజాతో  కలిసి ఈ సినిమాను నిర్మించడం చాలా సంతోషమని తెలిపారు. 'బేబీ' మూవీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఆనంద్ నటించనున్న మరో వైవిధ్యమైన ప్రేమ కథ ఇది అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'డ్యూయెట్' నాకొక స్పెషల్ మూవీ.. ఈ సినిమా టైటిల్ గురించి మా ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. రితిక 'ఆశోకవనంలో అర్జున కళ్యాణం' లో  చాలా బాగా నటించిందని చెప్పారు. డైరెక్టర్ మిథున్ ఈ సినిమాకు మంచి స్టోరీ రాశాడు.. టీంతో కలిసి ఒక మంచి మూవీ చేయబోతున్నామని అన్నారు. అలాగే జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో చేయడం చాలా ఆనందం అని తెలిపారు.

publive-image

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. నేను విజయతో 'నోటా' మూవీ చేశాను. ఇప్పుడు ఆనంద్ తో 'డ్యూయెట్' నిర్మిస్తున్నాను. ఆనంద్ నాకు చాలా రోజులుగా తెలుసు అందరితో చాలా పాజిటివ్ గా ఉంటారు. ఆనంద్ కు ఫస్ట్ హిట్ మా సంస్థ నుంచే ఇవ్వాలని ఉండే.. కానీ ఆ అవకాశం 'బేబీ' మేకర్స్ తీసుకున్నారు. మిథున్ కథ చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. గతంలో రాజా రాణి సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ కథ విన్నప్పుడు కూడా  అదే ఫీల్ కలిగిందని  చెప్పారు. సినిమాను నిర్మించడంలో మధుర శ్రీధర్ గారి సపోర్ట్ గా ఉన్నారని తెలిపారు.

Also Read: Varun-Lavanya Marriage: అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్యల పెళ్లి

Advertisment
Advertisment
తాజా కథనాలు