డిఫెరెంట్ గెటప్ లో 'బేబీ' హీరో.. కామెడీ రోల్ లో అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ, ఆకట్టుకుంటున్న'గం.గం.. గణేశా' ట్రైలర్!

సోమవారం ఆనంద్ దేవరకొండ 'గం.గం.. గణేశా' చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్ కామెడీ అండ్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

New Update
డిఫెరెంట్ గెటప్ లో 'బేబీ' హీరో.. కామెడీ రోల్ లో అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ, ఆకట్టుకుంటున్న'గం.గం.. గణేశా' ట్రైలర్!

Gam Gam Ganesha Trailer :గత ఏడాది 'బేబి' మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). ఈ సినిమాలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు.ఇక ఈ ఏడాది నవ్వించేందుకు రెడీ అయ్యాడు.

ఈసారి డిఫెరెంట్ గెటప్ తో 'గం.గం.. గణేశా' అంటూ సరికొత్త థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్ కామెడీ అండ్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Also Read : స్టార్ హీరోయిన్ కి ఘోర అవమానం.. ఎదురుగా వస్తున్నా పట్టించుకోని డెలివరీ బాయ్, వీడియో వైరల్!

ఫన్ అండ్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో

తాజాగా రిలీజైన 'గం. గం.. గణేశా' ట్రైలర్ ఫన్ అండ్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో సాగింది. ఇందులో హీరో దొంగగా కనిపించనున్నాడు. ఫ్రెండ్ తో కలిసి దొంగతనాలు చేసే హీరో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్లి వినాయకుడి విగ్రహం దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ..

కాగా ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ డిఫెరెంట్ లుక్ లో కనిపించడంతో పాటూ అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే వాడిగా, దొంగగా తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ట్రైలర్ లో కామెడీతో పాటూ సస్పెన్స్ ఎలివెంట్స్ ని సైతం ఆసక్తికరంగా చూపించారు.

చూస్తుంటే ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ మరో సక్సెస్ అందుకోవడం గ్యారెంటీగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు