Anagani Satya Prasad: చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ ఆలోచన, ప్రధాని మోదీ అండతో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు రెవిన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. 2014- 2019 మధ్య ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మిన్నగా 2024 నుంచి ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేస్తుందన్నారు.
Also Read: ముగ్గురుతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు..!
త్వరగా అభివృద్ధి..
చంద్రబాబు (CM Chandrababu Naidu) పోలవరం ప్రాజెక్టును సందర్శించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. పోలవరం, అమరావతిలో త్వరగా అభివృద్ధి జరుగుతుందని కామెంట్స్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అండతో తీర ప్రాంతమైన రేపల్లెను కూడా అభివృద్ధి చేస్తానన్నారు.
జగన్ కు పిచ్చి..
జగన్ కు (YS Jagan) విలాసవంతమైన భవనాల పిచ్చి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలను కొల్లగొట్టి ఋషికొండను (Rushikonda) అభివృద్ధి చేశామని చెప్తారని.. అయితే, ఋషికొండపై ఆ పార్టీ నాయకులకే సరైన అభిప్రాయం లేదని విమర్శలు గుప్పించారు. ఋషికొండను ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భవనం కట్టాలంటే నియమ నిబంధనలు ఉంటాయన్నారు.
Also Read: నడిరోడ్డుపై ప్రియురాలిని చంపిన ప్రియుడు.. ఇనుప రెంచ్‌తో 14 సార్లు కొట్టి దారుణం..!
ఏకైక రాజధాని..
కృష్ణా జిల్లాలోని అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములను మాజీ మంత్రి జోగి రమేష్ తన కొడుకు బంధువులు భూ హక్కు పత్రాలు మార్చారని అభియోగం వచ్చిందని వాటిపై కూడా పూర్తిగా విచారణ చేపడతామని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరుసగా మూడు సార్లు గెలిపించిన తన నియోజకవర్గం రేపల్లె ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వెళ్ళదని స్పష్టం చేశారు. అమరావతే ఏకైక రాజధాని అని పేర్కొన్నారు.