Ratna Bhandagaram: పూరీ జగన్నాధుని రత్నభాండాగారం కింద మరో నిధుల గది.. కొత్త విషయం వెలుగులోకి  

పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్న భాండాగారం ఇటీవల తెరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సంచలన విషయం బయటపడింది. రత్నభాండాగారం దగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గది ఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్ని నిధులు అప్పటి రాజులు భద్రపరిచారని అంటున్నారు.

Ratna Bhandagaram: రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రత్నభాండాగారం మూడోగది 
New Update

Ratna Bhandagaram: పూరీ జగన్నాథుని రత్నభాండాగారంలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది.  శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు అనేకంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు  మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతుచిక్కని పూరీ జగన్నాధుని నిధుల రహస్యం..ఇటీవల జగన్నాధుని రత్నభాండాగారం తలుపులు తెరిచి, అక్కడి నిధుల లెక్కింపు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు రత్నభాండాగారం అడుగున మరో రహస్య గది ఉందంటోన్న చరిత్రకారులు. ఆ గదిలోకి సొరంగమార్గం ద్వారా వెళ్లొచ్చని తెలుస్తోంది.  ఆ గదిలోనూ వెలకట్టలేని స్వామివారి సంపద ఉందని చరిత్ర చెబుతోంది. అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు అలాగే  మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంటున్నారు. గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువై ఉన్నాయని చెబుతున్నారు 

Ratna Bhandagaram: అక్కడకు 1902లో బ్రిటీష్‌ పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని పంపించి విఫలం అయ్యారని చరిత్రకారులు అంటున్నారు. అలనాటి రాజులు యుద్ధాలు చేసి ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించారని చరిత్రకారుల భావనగా ఉంది. భాండాగారం దిగువన సొరంగమార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మాణం చేపట్టారు.  ఆ రహస్య గదిని తెరవాలని..అందులోని సంపదను కూడా లెక్కించాలనీ చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2 గదులను తెరిచి అందులోని సంపదను చంగడా గోపురానికి తరలించారు. ఇక  మూడోగదిని ఎప్పుడు తెరవాలన్నదానిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుతం రత్నభాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 

జగన్నాధుని రత్నభాండాగారం తెరిచిన అధికారులు..

Ratna Bhandagaram: జగన్నాథ దేవాలయం ఆభరణాల నిల్వలను కాపాడే పాముల గురించిన కథలు అనేక తరాల నుండి ఆలయ రహస్యంలో ఒక భాగం. ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఆదివారం తెరిచారు. అయితే దీనిని తెరిచేముందు పాములు నిజంగా నిధిని రక్షిస్తున్నాయా అని ప్రజలు ఎదురు చూశారు.  రత్న భండారం గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒడిశాలోని చాలా మంది ప్రజలు ఈ నిధిని రక్షించడానికి 24 గంటలు నాగదేవతలు మోహరించారని చప్పుకుంటారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని టీమ్ ముందుజాగ్రత్త చర్యగా తమ వెంట పాములు పట్టేవారిని, పాముకాటుకు మందులు.. వైద్యులను  కూడా తీసుకెళ్లింది. అయితే లోపల అధికారులకు ఎటువంటి  పాము కనిపించలేదు. బయటి రత్నాల స్టోర్‌హౌస్ తెరిచారు.  దాని కంటెంట్‌లు భద్రంగా ఉంచడానికి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు బదిలీ చేసహ్రు. 

దీర్ఘకాల విశ్వాసాలు

Ratna Bhandagaram: పాములు లేకపోవడం వల్ల రత్న భాండాగారం దగ్గర  దైవ సర్పం కాపలాగా ఉందనే సంప్రదాయ నమ్మకంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పురాణం అనధికారిక ప్రవేశాన్ని నిరోధించడానికి, ఆలయ ఖజానాకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను జోడించడానికి చాలా కాలంగా పనిచేసింది. ఇటీవలి పరిశీలన ప్రకారం, రక్షించే పాము కథ మరింత ఎక్కువగా జరిగింది.  ఇది ఆలయ ఆస్తి పవిత్రత, దైవిక రక్షణను సూచిస్తుంది.

సాంస్కృతిక ప్రభావం

Ratna Bhandagaram: జగన్నాథ దేవాలయం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కథనంలో రక్షక పాము పురాణం ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇటీవలి ఆవిష్కరణలు ఈ పురాణాన్ని సవాలు చేస్తున్నాయి.  అయితే అవి ఆలయం గొప్ప జానపద కథలను, దాని సంపద పట్ల గౌరవాన్ని కూడా హైలైట్ చేస్తాయి.

#puri-jagannath-temple #rathna-bhandagaram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe