Nalgonda Gurukulam: నల్గొండ గురుకులం భవనం పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని

నల్గొండ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ లో దారుణం చోటుచేసుకుంది. గురుకులంలో సదుపాయాలు సరిగ్గా లేవని ఆందోళన చేసినందుకు విద్యార్థులకు వేధింపులు ఎదురయ్యాయి. వాటిని భరించలేక ఇంటర్ విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

New Update
Nalgonda Gurukulam: నల్గొండ గురుకులం భవనం పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని

Nalgonda Gurukulam: నల్గొండ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ లో దారుణం చోటుచేసుకుంది. గురుకులంలో సదుపాయాలు సరిగ్గా లేవని ఆందోళన చేసినందుకు విద్యార్థులకు వేధింపులు ఎదురయ్యాయి. వాటిని భరించలేక ఇంటర్ విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు, పళ్లు విరిగిపోయాయి. తీవ్ర గాయాలతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఇక వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్బీసీలో ఉన్న గంధవారి గూడెం సాంఘిక సంక్షేమ గరుకుల కళాశాలలో చోటుచేసుకుంది. కాగా కొన్ని రోజుల నుంచి గురుకుల కాలేజీలో సరైన సౌకర్యాలు లేవని, భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రిన్సిపల్ తో పాటు సిబ్బందిని నిలదీస్తున్నారు.

దీంతో సమస్యలను తీర్చడం పక్కన పెడితే.. ఎవరైతే గురుకులంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్నారో..ఆందోళనకు దిగుతున్నారో.. వారిని సిబ్బంది, టీచర్లు సైతం వేధింపులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కాలేజీలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి ప్రయత్నిస్తే వాళ్లను కూడా లోపలికి రాకుండా గురుకులం సిబ్బంది అడ్డుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే గురుకులంలో ఇంటర్మీడియట్ ఫస్ట ఇయర్ చదువుతున్న విద్యార్థినిని కూడా సిబ్బంది,ఉపాధ్యాయులు తీవ్రంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె వాటిని తాళలేక భవనం పై నుంచి దూకినట్టు సమాచారం. దీంతో ఆమె కాళ్లు, పళ్లు విరగడంతో పాటు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలిసింది. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది దాచిపెడుతున్నట్టు సమాచారం. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు