/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T133200.493-jpg.webp)
బెంగళూరుకు చెందిన స్టార్టర్ అల్ట్రా వయోలెట్ అటోమోటివ్ కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ఎఫ్77 మ్యాక్ 2. ఇది ఎఫ్77 బైక్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. అధిక మైలేజ్, అధిక శక్తి, అదనపు ఫీచర్లతో కంపెనీ ఈ బైక్‌ను తీసుకువచ్చింది.
ఈ బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మీరు కేవలం రూ. 5 వేల మొత్తంతో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. తర్వాత పూర్తి డబ్బులు కట్టాలి. ఈ బైక్ డెలివరీస్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతాయి. మే నెల నుంచి డెలివరీస్ ఉంటాయి.ఎఫ్ 77 మ్యాక్ 2 బైక్‌లో రెండు వేరియంట్లు ఉంటాయి. స్టాండర్డ్, రెకాన్ అనేవి ఇవి. స్టాండర్డ్ ధర రూ. 2.99 లక్షలు. ఇక రెకాన్ వేరియంట్ ధర రూ. 3.99 లక్షలు. ఇది బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ ధరలు కేవలం తొలి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. అందువల్ల కొనే వారు వెంటనే త్వరపడొచ్చు.
స్టాండర్డ్ వేరియంట్ రేంజ్ 211 కిలోమీటర్లు. ఇక రెకాన్ వేరియంట్ రేంజ్ 323 కిలోమీటర్లు. టాప్ వేరియంట్‌లో 10 లెవెల్స్ స్విచబుల్ రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ ఉంటాయి. అదే స్టాండర్డ్ వేరియంట్ అయితే మూడు లెవెల్స్ మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు.ఫీచర్ల విషయానికి వస్తే.. మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఐదు ఇంచుల టీఎఫ్‌టీ డిజిటల్ క్లస్టర్, ఆటో డిమ్మింగ్ లైట్స్, హిల్ హోల్డ్, ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4 లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది.ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనో షాక్, యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ రెకాన్ వేరియంట్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 155 కిలో మీటర్లు. దేశం లోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే.