Sikkim EarthQuake: సిక్కింలో భూకంపం సంభవించింది. ఉదయం 6.57 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4 గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.
నిన్న జపాన్ లో..
నిన్న జపాన్‌లో భూకంపం (Earthquake) కలకలం రేపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టం అయ్యాయి. దక్షిణ జపాన్‌లోని క్యుషు, షికోకులోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. హ్యుగా-నాడా సముద్రంలో భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం ప్రభావంతో మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదులు, సరస్సులు సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అక్కడి ప్రభుత్వం.