Sikkim EarthQuake: సిక్కింలో భూకంపం.. ఇంట్లో నుంచి జనం పరుగులు సిక్కింలో భూకంపం సంభవించింది. ఉదయం 6.57 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4 గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి పరుగులు తీశారు. By V.J Reddy 09 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sikkim EarthQuake: సిక్కింలో భూకంపం సంభవించింది. ఉదయం 6.57 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4 గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. An earthquake of magnitude 4.4 on the Richter Scale occurred today at 06:57 IST in Soreng, Sikkim: National Center for Seismology pic.twitter.com/EWi8YnlXSK — ANI (@ANI) August 9, 2024 నిన్న జపాన్ లో.. నిన్న జపాన్‌లో భూకంపం (Earthquake) కలకలం రేపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టం అయ్యాయి. దక్షిణ జపాన్‌లోని క్యుషు, షికోకులోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. హ్యుగా-నాడా సముద్రంలో భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం ప్రభావంతో మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదులు, సరస్సులు సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అక్కడి ప్రభుత్వం. #sikkim-earthquake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి