మణిపూర్‎లో ఆగని అల్లర్లు..మరోసారి కాల్పులు, ఒకరు మృతి

ఈశాన్యరాష్ట్రం మణిపూర్ లో హింస ఆగడం లేదు. రోజురోజుకూ హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తౌబాల్ జిల్లాలో, భారత రిజర్వ్ బెటాలియన్ శిబిరం నుండి ఒక గుంపు ఆయుధాలను దొంగిలించడానికి ప్రయత్నించింది. దీంతో సైన్యం కాల్పులు జరపడంతో 27 ఏళ్ల వ్యక్తి మంగళవారం మరణించాడు.

New Update
మణిపూర్‎లో ఆగని అల్లర్లు..మరోసారి కాల్పులు, ఒకరు మృతి

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య హింస పెరుగుతోంది. మరోవైపు, మంగళవారం, మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో ఒక గుంపు ఇండియన్ రిజర్వ్‌డ్ బెటాలియన్ (ఐఆర్‌బి) క్యాంపు నుండి ఆయుధాలను దోచుకోవడానికి ప్రయత్నించింది. దీంతో భద్రతా బలగాలు గుంపుపై కాల్పులు జరిపింది. ఈకాల్పల్లో 27 ఏళ్ల యువకుడు మరణించాడు.

manipur violence

ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ IRB బెటాలియన్ శిబిరంపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకోవడానికి గుంపు దాడికి ప్రయత్నించిందని సైన్యం తెలిపింది. ఈ ఘటనతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన బలగాలు తొలుత టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. సాయుధ గుంపు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు.

క్యాంపు వైపు వెళ్తున్న అస్సాం రైఫిల్స్ టీమ్‌పై గుంపు దాడి చేసింది. అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాల్పులు జరిపారని, ఒక జవాన్ గాయపడ్డారని, వారి వాహనానికి నిప్పంటించారని అధికారులు తెలిపారు. జవాన్ కాలికి బుల్లెట్ గాయమైనట్లు అధికారులు చెప్పారు. ఈ ఘర్షణలో రొనాల్డో అనే వ్యక్తి గాయపడటంతో... అతడిని మొదట తౌబాల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణల్లో మరో 10 మంది గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందన్నారు.

మే 3న మొదలైన హింస:
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా హింస చెలరేగింది. ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు. అనేక వందల మంది గాయపడ్డారు, అలాగే వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజన నాగాలు, కుకీలు జనాభాలో 40 శాతం ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు