Amul in America: అమూల్ దూద్ పీతా హై దునియా! ఇకపై అమెరికాలోనూ.. 

భారత దేశంలో ఇంటింటికీ పరిచయం ఉన్న అమూల్ మిల్క్ ఇప్పుడు అమెరికా మార్కెట్లోకి దూసుకుపోయింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇప్పుడు అమూల్ పాలను అమెరికాలో మార్కెటింగ్  చేయబోతోంది. అమెరికాలో భారతదేశం నుంచి మొదటిసారిగా ఒక మిల్క్ ప్రోడక్ట్ అడుగుపెట్టబోతోంది.

New Update
Amul in America: అమూల్ దూద్ పీతా హై దునియా! ఇకపై అమెరికాలోనూ.. 

Amul in America: అమూల్ దూద్ పీతా హై ఇండియా... ఇది మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్న క్యాప్షన్. ఇప్పుడు దానిని మనం మార్చి చెప్పుకోవాల్సి ఉంటుందేమొ. ఎందుకంటే..  ఇప్పుడు భారతదేశ ప్రజలే కాదు, అమెరికా ప్రజలు కూడా ఈ పాలు తాగుతారు. ఈ పాట పాడుతారు.. కాకపొతే,  అమూల్ దూద్ పీతా హై దునియా అని పాడుకోవచ్చు. మరి ఇప్పుడు మన అమూల్ పాలు భారత ఎల్లలు దాటుతోంది కదా. ఇప్పుడు అమూల్ బ్రాండ్ యజమాని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. అమెరికాలో తొలిసారిగా ఒక భారతీయ డెయిరీ (Amul in America)ఎంట్రీ ఇస్తోంది. అది అమూల్. భారతదేశంలో రోజుకు లక్షల లీటర్ల తాజా పాలను సరఫరా చేసే అమూల్ బ్రాండ్ ఇప్పుడు అమెరికాలోనూ తన శక్తిని ప్రదర్శించనుంది. అమూల్ బ్రాండ్ ఇక్కడ తాజా పాల విభాగంలో తన వ్యాపారాన్ని తీసుకువస్తుంది.

Also Read: అవసరానికి ఉపయోగపడని.. రైల్వే యాప్! దీనిని నమ్ముకుంటే అంతే సంగతులు!!

108 ఏళ్ల నాటి డెయిరీతో కలిసి..
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమెరికాలో అమూల్ బ్రాండ్ పాలను(Amul in America) విక్రయించడానికి అమెరికాకు చెందిన 108 ఏళ్ల డెయిరీ 'మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్'తో ఒప్పందం కుదుర్చుకుంది. GCMMF మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా సహకార వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమూల్ బ్రాండ్ తాజా పాల శ్రేణిని భారతదేశం వెలుపల అమెరికా వంటి మార్కెట్లలో విడుదల చేయడం ఇదే మొదటిసారి. అమెరికాలో భారతీయ సంతతికి చెందిన అధిక జనాభా ఉంది. ఇది అమూల్ కి(Amul in America) కలిసివచ్చే అంశం అని చెప్పవచ్చు. 

అమూల్ మిల్క్ అమెరికాలో ఏ ప్యాకింగ్స్ లో వస్తుందంటే..
అమూల్ USలో పాలను ఒక గాలన్ (3.8 లీటర్లు), హాఫ్ గ్యాలన్ (1.9 లీటర్లు) ప్యాకేజింగ్‌లో విక్రయిస్తుంది. అమెరికాలో 6% ఫ్యాట్ ఉన్న అమూల్ గోల్డ్ బ్రాండ్, 4.5% ఫ్యాట్ ఉన్న అమూల్ శక్తి బ్రాండ్, 3% ఫ్యాట్ ఉన్న అమూల్ తాజా, 2% ఫ్యాట్ ఉన్న అమూల్ స్లిమ్ బ్రాండ్ మాత్రమే అమ్మకానికి(Amul in America) ఉంచుతున్నారు. ఈ బ్రాండ్లతో ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ - మిడ్-వెస్ట్ మార్కెట్లలో బిజినెస్ చేస్తారు. 

అమూల్ అనేది మనదేశంలో ఇంటి ఇంటింటికీ పరిచయమైనా పేరు. ఇది భారతదేశంలోని సూపర్ బ్రాండ్లలో ఒకటి. ఇది మాత్రమే కాదు, భారతదేశంలో 'శ్వేత విప్లవం' తీసుకురావడంలో అమూల్‌కు పెద్ద సహకారం ఉంది. దీని విజయం భారతదేశంలో పాడి సహకార సంఘాలు పెద్ద ఎత్తున విస్తరించడానికి దారితీసింది. అమూల్(Amul in America) కారణంగానే  నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు పునాదులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా.. భారతీయ మహిళా శక్తికి గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇప్పుడు ప్రపంచ గుర్తింపు తేవడంలో విజయం సాధించిందని చెప్పవచ్చు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు