Amritpal Singh: రేపు ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృతపాల్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 'వారిస్ పంజాబ్ దే' అధినేత అయిన అమృత్పాల్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి గెలుపొందారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృతపాల్ విచారణ ఖైదీగా ఉన్నారు. పెరోల్ లభించకపోవడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణం చేసే రోజు చేయడానికి వీలు కాలేదు. తాజాగా ఆయనకు జూలై 5వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పెరోల్ లభించింది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్ లో అమృతపాల్ తో ఎంపీగా ప్రమాణం చేయిస్తారు.
Amritpal Singh: రేపు ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృతపాల్ సింగ్
రేపు ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృతపాల్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈయన ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.
New Update
తాజా కథనాలు