Pawan Kalyan Deputy CM: డిప్యూటీ సీఎంగా పవన్.. లీక్ చేసిన అమిత్ షా, చిరంజీవి!

పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమని స్పష్టం అవుతోంది. చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన చిరంజీవి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పవన్ ను డిప్యూటీ సీఎంగా సంబోధించారు. దీంతో వారు పక్కా సమాచారంతోనే ఇలా ట్వీట్ చేశారని పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

New Update
Pawan Kalyan Deputy CM: డిప్యూటీ సీఎంగా పవన్.. లీక్ చేసిన అమిత్ షా, చిరంజీవి!

ఈ రోజు ఏపీ సీఎంగా చంద్రబాబు, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్, నారా లోకేషన్ తదితరులు ఉన్నారు. అయితే.. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌ కు ఏ మంత్రిత్వ శాఖ దక్కుతుంది? ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. మరికొన్ని గంటల్లో చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు.

అయితే.. కేంద్ర హోం మత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కు కొద్ది సేపటి క్రితం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్‌ ను డిప్యూటీ సీఎంగా వారు సంబోధించారు. దీంతో పవన్ కు డిప్యూటీ సీఎం పదవి పక్కా అని తెలుస్తోంది. వారికి ఉన్న సమాచారం ఆధారంగానే ఇలా ట్వీట్ చేసినట్లు అర్థం అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ ట్వీట్స్ ను వైరల్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు