Amitabh Bachchan: అభిమానికి మాస్ కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్ బిగ్ బి..!

అమితాబచ్చన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూల రంగుల చొక్కా, కింద నల్లటి పాయింట్ తో దర్శనమిచ్చారు బిగ్ బీ. అయితే, తను వేసుకున్న ట్రాక్ పాయింట్ కు బొందు తాడులు వేలాడుతూ కనిపించాయి. దీంతో ఆ అభిమాని ‘బ్రదర్ మీ ట్యాగ్ వేలాడుతోంది’ అని అన్నాడు. ఈ ప్రశ్నకు అమితాబ్ కౌంటర్ ఇస్తూ.. ‘‘బ్రదర్ ఇది పాయింట్ తాడులు కాదు. నేటి తరం ఫ్యాషన్ సెన్స్ అలా ఉంది. అదే వేలాడుతోంది’’అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అమితాబ్ పోస్ట్ కు నెటిజన్స్‌ నుండి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.

Amitabh Bachchan: అభిమానికి మాస్ కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్ బిగ్ బి..!
New Update

Amitabh Bachchan: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్(Amitabh Bachchan) చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూల రంగుల చొక్కా, కింద నల్లటి పాయింట్ తో దర్శనమిచ్చారు బిగ్ బీ. అయితే, అతను వేసుకున్న ట్రాక్ పాయింట్ కు బొందు తాడులు వేలాడుతూ కనిపించాయి. దీంతో ఆ అభిమాని ‘బ్రదర్ మీ ట్యాగ్ వేలాడుతోంది’ అని అన్నాడు. ఈ ప్రశ్నకు అమితాబ్ కౌంటర్ ఇస్తూ.. ‘‘బ్రదర్ ఇది పాయింట్ తాడులు కాదు. నేటి తరం ఫ్యాషన్ సెన్స్ అలా ఉంది. అదే వేలాడుతోంది’’అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అమితాబ్ పోస్ట్ కు నెటిజన్స్‌ నుండి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.

publive-image

అమితాబచ్చన్ ప్రతి ఆదివారం తన అభిమానులతో గడుపుతుంటారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ వారితో టచ్ లో ఉంటుంటారు. రిసెంట్ గా అబితాబ్ తన అభిమానులను పలకరిస్తున్న ఫొటో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అమితాబ్ వస్త్రధారణ చాలా భిన్నంగా ఉండడాన్ని చూడొచ్చు. పూల రంగుల చొక్కా, కింద నల్లటి పాయింట్ తో  కనిపిస్తున్నారు. అయితే అది ట్రాక్ పాయింట్ అయి ఉండొచ్చు. కానీ దాని బొందు తాడులు వేలాడుతూ కనిపించింది. ఈ పోస్ట్ చూసిన అభిమాని దీన్ని చలోక్తిగా మలిచాడు. కాగా, అభిమాని ఏమన్నది, దానికి తాను ఏమని బదులిచ్చిందీ అమితాబచ్చన్ వెల్లడించారు.

publive-image

ఇండియన్ మూవీ లెజెండ్, బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ స్థాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా అంటే ప్రపంచంలో ఎక్కడైనా ముందుగా వినిపించే పేరు అమితాబచ్చన్. సూపర్ స్టార్ అమితాబచ్చన్ అంటే  విపరీతమైన క్రేజ్. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన అమితాబ్ జీవితం బాలీవుడ్ బాద్ షా ఎదిగారు.

Also Read: బంపర్‌ ఆఫర్ కొట్టేసిన బేబి హీరోయిన్..!

#amitabh-bachchan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe