Kalki 2898AD : వాళ్ళ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన 'కల్కి' టీమ్.. లీక్ చేసిన అమితాబ్, పోస్ట్ వైరల్!

'కల్కి' సినిమాకు సంబంధించి తాజాగా అమితాబ్‌ తన బ్లాగ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.' కల్కి టీమ్‌ కొంతమందితో ఒక షో ప్లాన్‌ చేస్తుంది. దానికోసం ఇప్పటికే వర్క్‌ మొదలైంది. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది' అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Kalki 2898AD : వాళ్ళ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన 'కల్కి' టీమ్.. లీక్ చేసిన అమితాబ్, పోస్ట్ వైరల్!
New Update

Amitabh Bachchan : ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ప్రస్తుతం  ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ, భారీ వసూళ్లను రాబడుతుంది. భవిష్యత్తు నేపథ్యంలో సాగే కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ప్రభాస్ తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

ఇప్పటివరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా అమితాబ్‌ తన బ్లాగ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచింది.సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్‌బీ.. ‘కల్కి’ని ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు." కల్కి టీమ్‌ కొంతమందితో ఒక షో ప్లాన్‌ చేస్తుంది. దానికోసం ఇప్పటికే వర్క్‌ మొదలైంది.

Also Read : అత్యవసర శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లనున్న షారుఖ్ ఖాన్.. ఆందోళనలో అభిమానులు?

నేనూ పని చేస్తున్నాను. దయచేసి ఈ పోస్ట్‌ను ఆహ్వానంగా భావించొద్దు. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. ఇది ఫలించొచ్చు.. విఫలమవ్వచ్చు. లవ్‌ యూ ఆల్‌" అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్ర పోషించగా.. విజయ్ దేవరకొండ అర్జునుడిగా ఆకట్టుకున్నారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ రోల్ లో అదరగొట్టారు.

#amitabh-bachchan #kalki-2998-ad-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe