Amit Shah's Khammam tour: ఈ నెల 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నాను. దీనికి సంబంధించి షెడ్యూల్ ఫిక్స్ అయింది. అమిత్ షా.. బీజేపీ ఆదివారం ఖమ్మంలో నిర్వహిస్తున్న ‘రైతు గోస బీజేపీ భరోసా’ (Rythu Gosa-BJP Bharosa) భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీని కోసం ఆయన 27న ఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.
గన్నవరం నుంచి హెలికాప్టర్ లో 2.10pm కు కొత్తగూడెంకు అమిత్ షా చేరుకుంటారు. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం (Badrachalam) చేరుకొని రాములవారిని దర్శించుకుంటారు. 2.25 pm గనుంచి 2.40pm వరకు రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు అమిత్ షా చేరుకుంటారు.
కొత్తగూడెం నుంచి 2.55 pm కు బీఎస్ఎఫ్ హెలికాప్టర్ లో బయలుదేరి 3.30pm కు ఖమ్మం చేరుకుంటారు. ఇక 3.45 pm నుంచి 4.45pm వరకు గంట పాటు బహిరంగ సభలో (Public Meeting) అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తరువాత అమిత్ షా గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. వారికి రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
తరువాత సాయంత్రం 5.45గంలకు హెలికాప్టర్ లో బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.20గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఇప్పటికే ఖమ్మం సభ మూడు సార్లు వాయిదా పడింది. మరి ఈసారైనా అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా అని పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నారు.
Also Read: వావ్…జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!!