Tamilisai Vs Amit Shah: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్టేజిగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ పార్టీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశం సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారి తీసింది. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళిసై సౌందరరాజన్ అతిథిగా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా ఆమెను అమిత్ షా వెనక్కి పిలిచి కోపంగా చూస్తూ అలా చేయొద్దు అంటూ ఎదో చెప్పారు. కాగా దీనికి సంబంధించని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళిసై ను అమిత్ షా తిట్టారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే తమిళిసైపై అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కాగా లోక్ సభ ఎన్నికలు తమిళనాడులో చిచ్చు పెట్టాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షురాలు తమిళిసై మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇటీవల తమిళిసై మాట్లాడుతూ.. బీజేపీలోకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. కాగా తమ నాయకుడు అన్నామలై ని టార్గెట్ చేస్తూ తమిళిసై వ్యాఖ్యలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు ఇరు నేతల సపోర్టర్స్. కాగా తమిళిసై, అమిత్ షా నడుమ జరిగిన సంభాషణ వారే క్లారిటీ ఇవ్వాలి.