Tamilisai Vs Amit Shah: మాజీ గవర్నర్ తమిళిసైపై అమిత్ షా సీరియస్! చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై నడుమ సంభాషణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తమిళసైకు అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై వారే క్లారిటీ ఇవ్వాలి. By V.J Reddy 12 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Tamilisai Vs Amit Shah: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్టేజిగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ పార్టీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశం సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారి తీసింది. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళిసై సౌందరరాజన్ అతిథిగా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా ఆమెను అమిత్ షా వెనక్కి పిలిచి కోపంగా చూస్తూ అలా చేయొద్దు అంటూ ఎదో చెప్పారు. కాగా దీనికి సంబంధించని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళిసై ను అమిత్ షా తిట్టారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే తమిళిసైపై అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా లోక్ సభ ఎన్నికలు తమిళనాడులో చిచ్చు పెట్టాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షురాలు తమిళిసై మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇటీవల తమిళిసై మాట్లాడుతూ.. బీజేపీలోకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. కాగా తమ నాయకుడు అన్నామలై ని టార్గెట్ చేస్తూ తమిళిసై వ్యాఖ్యలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు ఇరు నేతల సపోర్టర్స్. కాగా తమిళిసై, అమిత్ షా నడుమ జరిగిన సంభాషణ వారే క్లారిటీ ఇవ్వాలి. #tamilisai-vs-amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి