సర్దార్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించింది: అమిత్ షా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. CRPF సెక్టార్ నుంచి అమిత్ షా పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు. By BalaMurali Krishna 17 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ ప్రజలందరికి విమోచన దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించిన రోజు అన్నారు. రజకార్లపై పోరాడిన యోధులకు నివాళుర్పిస్తున్నానని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదన్నారు. పటేల్, మున్సీ వల్లే నిజాం పాలన అంతమైందని షా వెల్లడించారు. తెలంగాణ, కళ్యాణ్ కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవని.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల విమోచనం కలిగిందన్నారు. ఆపరేషన్ పోలో పేరిట నిజాం, రజాకార్ల మెడలు వంచారని పేర్కొన్నారు. తెలంగాణ ముక్తి కోసం పోరాడిన నర్సింహారావు, పండిట్ కేశవ్, ప్రభాకర్, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు తదితరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవానికి 75 సంవత్సరాలు అయ్యాయని.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. G20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిశాయన్నారు. విశ్వ గురువు స్థానంలో దేశం నిలిచిందని.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే గతంలో ఉన్న ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించలేదన్నారు. చంద్రయాన్ సక్సెస్ అయిందని..ఇది దేశానికి పెద్ద గర్వకారణమని చెప్పారు. విమోచన దినోత్సవం చరిత్ర గురించి ఏమాత్రం పట్టింపు లేని వారిని ప్రజలు కూడా పట్టించుకోరని మండిపడ్డారు. 399 రోజులు రజాకార్లకు బానిసలుగా బతకాల్సి వచ్చిందని.. ఆ సమయంలో వారు ప్రజలతో చాలా క్రూరంగా వ్యవహరించారన్నారు. 400వ రోజు ఆపరేషన్ పోలోను పటేల్ ప్రారంభించారని.. చుక్క రక్తం బొట్టు కారకుండా హైదరాబాద్ విలీనానికి నిజాం అంగీకరించేలా మెడలు వంచారని తెలిపారు. తెలంగాణ, కళ్యాణ్ కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు ఒక్కటి చెప్పదలుచుకున్నా.. మన కోసం పూర్వీకులు చేసిన బలిదానాలను భావితరాలకు అందించాలని అమిత్ షా సూచించారు. అంతకుముందు CRPF సెక్టార్ నుంచి అమిత్ షా పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతం ఆలాపన తర్వాత సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. బతుకమ్మ ఆటపాట, కోయనృత్యాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, ఉగ్గు కళాకారుల ప్రదర్శనలను అమిత్ షా తిలకించారు. అమిత్ షా పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్ చుట్టూ CRPF బలగాలను మోహరించారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న రైల్వేస్టేషన్ బస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. సికింద్రాబాద్ పరిధిలోని హోటల్, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ రాకముందు తెలంగాణ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు. "హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక & మరాఠ్వాడా ప్రాంత ప్రజలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజాం దుష్ట పాలన, అణచివేత నుండి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన అలుపెరగని పోరాటానికి, ఇక్కడి ప్రజల అచంచల దేశభక్తికి ఈ రోజు నిదర్శనం. హైదరాబాద్ ముక్తి సంగ్రామంలో అమరవీరులైన వారికి నివాళులర్పిస్తున్నాను" అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. On Hyderabad Liberation Day, I extend my heartfelt best wishes to the people of Telangana, Hyderabad-Karnataka & Marathwada region. This day marks the unwavering patriotism of the people of Hyderabad and commemorates their unyielding struggle to set themselves free from the… pic.twitter.com/DmY8ZQLqeQ — Amit Shah (@AmitShah) September 17, 2023 ప్రజా ఉద్యమమైన తెలంగాణ విముక్తి పోరాటం.. ముమ్మాటికీ విమోచన దినోత్సవమే అంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. చరిత్రను మరుగుపరిచే కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. Met ace badminton player @Pvsindhu1 today in Hyderabad. The nation takes pride in the international acclaim she has received for her exceptional sporting talent. Her commitment, hard work, and dedication are an inspiration for the younger generation. pic.twitter.com/qUS9X3MF9M — Amit Shah (@AmitShah) September 16, 2023 మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పీవీ సింధు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనూ పీవీ సింధు భేటీ అవ్వడం చర్చనీయాంశమవుతోంది. పీవీ సింధుపై అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అసాధారణమైన క్రీడా ప్రతిభకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నందుకు దేశం గర్విస్తుందన్నారు. ఇది కూడా చదవండి: పోటాపోటీ రాజకీయ కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి