/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Andhra-Pradesh-Assembly-Ses-jpg.webp)
Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండవ రోజు సమావేశాల్లోనూ అదే గందరగోళం నెలకొంది. టీడీపీ(TDP) సభ్యుల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దాంతో సభను 5 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. కాగా, టీడీపీ సభ్యులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. సభలో ఏది పడితే అది.. ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి. టీడీపీ సభ్యులు తమను అంత సులువుగా తీసుకోవద్దంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు బుగ్గన. అయితే, గురువారం సభలో తమను యూజ్‌లెస్ ఫెలోస్ అన్నారంటూ స్పీకర్‌తో టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ తీరు సరిగా లేదంటూ వాదనకు దిగారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో ఎదురుదాడికి దిగారు వైసీపీ సభ్యులు. ఇలా టీడీపీ సభ్యుల నిరసన, వైసీపీ సభ్యుల కౌంటర్‌తో సభకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
Also Read:
Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..
Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..