Return to Nature: డెడ్ బాడీలతో బ్లాక్ దందా.. ఆ సంస్థకు రూ.7.9 వేల కోట్లు ఫైన్‌!

మృతదేహాలతో బ్లాక్ దందా చేస్తున్న అమెరికాలోని ‘రిటర్న్‌ టూ నేచర్‌’ అనే సంస్థకు కోర్టు రూ.7.9 వేల కోట్లు ఫైన్‌ వేసింది. డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబాలకు నకిలీ బూడిద ఇచ్చిన కేసులో ఈ తీర్పు వెల్లడించింది. సంస్థ ఓనర్ జాన్‌, క్యారీ హాల్‌ఫోర్డ్‌లను అరెస్ట్ చేశారు.

New Update
Return to Nature: డెడ్ బాడీలతో బ్లాక్ దందా.. ఆ సంస్థకు రూ.7.9 వేల కోట్లు ఫైన్‌!

America: చనిపోయిన మనుషుల దేహాలతో బిజినెస్ చేస్తున్న ఓ ప్రముఖ సంస్థకు కోర్టు భారీ ఫైన్ విధించింది. మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామంటూ బాధితులనుంచి భారీగా డబ్బు కాజేసి, కుటుంబ సభ్యుకు నకిలీ బూడిద ఇచ్చిన అమెరికాలోని ‘రిటర్న్‌ టూ నేచర్‌’ అనే సంస్థకు అక్కడి న్యాయస్థానం రూ.7.9 వేల కోట్లు ఫైన్‌ వేసింది.

మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామంటూ..
ఈ మేరకు ‘రిటర్న్‌ టూ నేచర్‌’ అనే సంస్థను అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో 2016లో ప్రారంభించారు. మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామంటూ బాధితుల కుటుంబాల నుంచి 1,30,000 డాలర్లు సొమ్ము వసూలుచేసినట్లు పోలీసులు గుర్తించారు. కొవిడ్‌ సమయంలో 9,00,000 డాలర్ల సహాయనిధిని కూడా వీరు దుర్వినియోగం చేసినట్లు బయటపెట్టారు. 2021లో దీనిని జాన్‌, క్యారీ హాల్‌ఫోర్డ్‌లు కొనుగోలు చేయగా అప్పటికే సంస్థపై పలు కేసులున్నాయి. ఈ క్రమంలో ఓ కేసు విషయంలో 2023 అక్టోబర్‌లో ఈ సంస్థ పరిసరాలను అధికారులు తనిఖీ చేయగా భయంకరమైన నిజం బయటపడింది. కుళ్లిన 190 మృతదేహాలు అధికారులకు దొరికాయి. వెంటనే అక్కడినుంచి వాటిని వేరేచోటుకు తరలించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఈ ఘటనతో పరారీలో ఉన్న జాన్‌, క్యారీ హాల్‌ఫోర్డ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Paris Olympics: ఫైనల్‌లోకి భారత గోల్డెన్ బాయ్.. మరో రికార్డుకు చేరువలో నీరజ్ చోప్రా!

ఈ కేసును విచారించిన న్యాయస్థానం కార్లు, ఖరీదైన ట్రిప్పులకు ఈ సొమ్మును వెచ్చించినట్లు వెల్లడించింది. చివరికి క్రిప్టోల్లో కూడా పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. బాధితుల బంధువు వేసిన సివిల్‌ కేసును విచారించి 950 మిలియన్‌ డాలర్ల ఫైన్‌ విధించింది. తమ వారి చితాభస్మంగా భావించి ఉంచుకొన్న అస్తికల విషయంలో బాధితులను మానసిక క్షోభకు గురి చేసినందుకు భారీ ఫైన్ వేసింది.

Advertisment
తాజా కథనాలు