Weight Loss : వారంలోనే బరువు తగ్గించే అమెరికన్ డైట్ ప్లాన్ బరువు తగ్గడానికి అనేక రకాల డైట్ ప్లాన్‌లు ఉన్నాయి. అయితే అమెరికా డైట్‌ప్లాన్‌తో ఈజీగా బరువు తగ్గవచ్చు. శరీరంలో సరైన పోషకాల సమతుల్యత ఉండడంతో పాటు వెయిట్ లాస్ అయ్యేలా ఈ డైట్‌ప్లాన్ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Weight Loss Plan : బరువు తగ్గడానికి(Weight Loss) ప్రజలు చేయని ప్రయత్నాలు ఉండవు. వ్యాయామం(Exercise) దగ్గరి నుంచి తినే ఆహారం(Eating Food) వరకు చక్కలా ప్లాన్ చేసుకుంటారు. అయితే అమెరికా డైట్‌ప్లాన్(America Diet Plan) సులభంగా బరువు తగ్గేందుకు చాలా ఉపయోగపడుతోంది. బరువు తగ్గడానికి అనేక రకాల డైట్ ప్లాన్‌లు ఈ రోజుల్లో ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే అమెరికాలోని జనరల్ మోటార్స్ కంపెనీ తన ఉద్యోగుల ఫిట్‌నెస్ కోసం తయారు చేసిన డైట్ ప్లాన్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది డైటీషియన్ల సలహా తీసుకున్న తర్వాత ఈ డైట్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. శరీరంలో సరైన పోషకాల సమతుల్యత ఉండేలా ఈ డైట్ ప్లాన్‌లో అలాంటి వాటిని చేర్చారు. ఈ డైట్ ప్లాన్‌ని సరిగ్గా పాటిస్తే వారంలోనే 3 కిలోల వరకు బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. మొదటి రోజు: మొదటి రోజు ఆహారంలో పండ్లను(Fruits) మాత్రమే తీసుకోవాలి. ఏదైనా పండు తీసుకోవచ్చు. ద్రాక్ష, అరటి, లిచీ, మామిడి వంటి పండ్లను తినొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా పుష్కలంగా నీరు తాగాలి. రోజంతా కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా మీ ఆహారంలో సీతాఫలం, పుచ్చకాయలను చేర్చుకోవాలని చెబుతున్నారు. రెండవ రోజు: రెండోరోజు కేవలం కూరగాయలు(Vegetables) మాత్రమే తినాలి. పచ్చి లేదా ఉడికించిన ఏదైనా కూరగాయలను తినవచ్చు. రోజంతా ఎన్ని కూరగాయలైనా తినవచ్చు. రోజు ప్రారంభంలో కొద్దిగా ఉడికించిన కూరగాయలను తినాలని నిపుణులు అంటున్నారు. సలాడ్, సూప్‌ల రూపంలో కూడా కూరగాయలను తీసుకోవచ్చని, అలాగే 8 గ్లాసుల నీళ్లు తాగొచ్చని చెబుతున్నారు. మూడవ రోజు: మూడో రోజు మిశ్రమంగా తినాలి. అంటే పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు. ఇలా ఉదయం పూట పండ్లు, మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, సలాడ్ వంటివి తినాలి. రాత్రి భోజనానికి కూరగాయల సూప్ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. నాలుగో రోజు: పాలు(Milk), అరటిపండు(Banana) తినాలి. రోజుకు 8 అరటిపండ్లు తినవచ్చు. అంతేకాకుండా 3 గ్లాసుల పాలు కూడా తాగవచ్చు. పాలలో చక్కెర కలపకూడదని అంటున్నారు. కావాలనుకుంటే రోజులో ఒకసారి వెజిటేబుల్ సూప్ కూడా తాగొచ్చని, నాలుగోరోజు 10 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఐదో రోజు: ఈ రోజు ఆహారంలో టమోటాలు(Tomato) చేర్చుకోవాలి. రోజుకు కనీసం 6 టమోటాలు తినాలి. నీళ్లు కూడా 15 గ్లాసులు తాగాల్సి ఉంటుంది. పచ్చి టొమాటోలు తిని విసుగు చెందితే టొమాటో సూప్ కూడా చేసుకుని తాగవచ్చు. లంచ్ లేదా డిన్నర్ కోసం కప్పు బ్రౌన్ రైస్, కొంచెం చికెన్ లేదా చీజ్ తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఆరో రోజు: ఈ రోజు ఆహారంలో మొలకెత్తిన ధాన్యాలతో(Sprouted Grains) పాటు కొన్ని కూరగాయలు తీసుకోవాలి. సూప్‌లతో పాటు లంచ్‌లో దాదాపు 2 కప్పుల బ్రౌన్ రైస్, చీజ్ లేదా చికెన్ కూడా తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఏడో రోజు: ఏడోరోజు అన్ని కూరగాయలు, ఒక గిన్నె బ్రౌన్ రైస్(Brown Rice) తినవచ్చు. కావాలంటే పండ్ల రసం కూడా తాగవచ్చు. 12 నుంచి 14 గ్లాసుల నీరు తాగాలి. ఈ 7 రోజుల్లో మీ శరీరం పూర్తిగా డిటాక్స్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #best-helth-tips #5-weight-loss-tips #american-diet-plan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి