Henry Kissinger Death: 'ఇందిరాను B***H, ఇండియన్స్‌ను BA*****S..' హెన్రీ ఇంకా లేరు!

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పని చేసిన హెన్రీ కిస్సంజర్‌ మరణించారు. ఇందిరాగాంధీని 'B***H' అని, ఇండియన్స్‌ను BA*****S..' అని నాటి(1971) అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌తో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో భారతీయుల ఆగ్రహానికి కారణం అయ్యాయి.

New Update
Henry Kissinger Death: 'ఇందిరాను B***H, ఇండియన్స్‌ను BA*****S..' హెన్రీ ఇంకా లేరు!

ఇందిరా అంటే ఇండియాకు అమ్మగా భావించే రోజులవి. ఇందిరాగాంధీ(Indira Gandhi)ని దుర్గమాతతో పోల్చిన దేశం మనది. ఎమర్జెన్సీ విధింపునకు ముందు దేశంలో ఇందిరా అంటే అందరికి ప్రేమ, గౌరవం.. ఇక ప్రపంచంలో ఎంతో శక్తిమంతమైన మహిళల్లో ఇందిరాకు ఎప్పుడూ స్థానం ఉంటుంది. బంగ్లాదేశ్‌(bangladesh)కు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన లీడర్‌గా ఇందిరాను గుర్తిస్తారు. ఈస్ట్‌-పాకిస్థాన్‌(పాకిస్థాన్‌), వెస్ట్-పాకిస్థాన్‌(బంగ్లాదేశ్‌) మధ్య జరిగిన యుద్ధంలో భారత్‌ వెస్ట్‌ పాకిస్థాన్‌ వైపు నిలపడి పోరాడింది. అటు పాకిస్థాన్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. ఇది ఇండియా-పాక్‌ మధ్య జరిగిన రెండో యుద్ధం(1971)గా భావించవచ్చు. ఇక నాటి ప్రధాని ఇందిరాని ఓ వ్యక్తి అత్యంత అవమానకరమైన పదజాలంతో దూషించాడని తెలుసా? ఇటు భారతీయులను కూడా అత్యంత ఘోరంగా అవమానించినట్లు తెలుసా? అతనే హెన్రీ కిస్సింజర్. ఆయన తన 100వ ఏటా బుధవారం కన్నుమూశారు. దీంతో ఆయన ఇందిరాను తిట్టిన మేటర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

publive-image ఇందిరాగాంధీతో హెన్రీ కిస్సింజర్

అమెరికాకు సూపర్ సెక్రటరీ:
1969 -1977 మధ్య అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్-గెరాల్డ్ ఫోర్డ్ ఆధ్వర్యంలో ప్రపంచ విధానాన్ని రూపొందించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పేరు ప్రసిద్ది చెందారు హెన్రీ కిస్సింజర్. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో భారతీయులను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని విభేదించారు హెన్రీ. డిక్లాసిఫైడ్ టేప్ ప్రకారం నవంబర్ 1971లో ఇందిరా గాంధీని కలిశారు హెన్రీ. అప్పుడు ఇండియా-పాకిస్థాన్‌ మధ్య బంగ్లాదేశ్‌ విముక్తి కోసం యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో రిచర్డ్ నిక్సన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య సంభాషనలో ఇందిరినా నిక్సన్‌ 'Old W***h* అని పిలిచాడు. కిస్సింజర్ ఇందిరాను 'a b**ch' అని అనడంతో పాటు భారతీయులను BA*****S' అని అనడం టేప్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన ఆడియో లీక్‌ అయిన తర్వాత హెన్రీ కిస్సింజర్‌ భారతీయులకు సారీ చెప్పాడు. ఇందిరా అంటే తనకు గౌరవం ఉందని చెప్పుకున్నాడు. టేప్‌లు విడుదలైన తర్వాత, కిస్సింజర్ తన మాటలకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ.. యుద్ధం కారణంగా అలా అనాల్సి వచ్చిందని.. నిజానికి తనకు ఇందిరా అంటే గౌరవం ఉందని చెప్పాడు.


కిస్సింజర్‌ను కలవకూడదని ఇందిరా ఏం చేశారో తెలుసా?
1974లో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా కిస్సింజర్‌ భారత్‌కు వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి స్వాగతం దక్కలేదు. ఒక సాధారణ అధికారిగానే ఆయన్ను ట్రీట్ చేశారు. అదే సమయంలో ఇందిరా కశ్మీర్‌కు వెళ్తున్నట్లు ప్రకటించారు. 'నీన్ను ఎవరూ పట్టించుకోరు' అని పరోక్షంగా కిస్సింజర్‌కు సందేశం ఇచ్చేందుకే ఇందిరా ఇలా చేశారని విశ్లేషకులు చెబుతుంటారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌కు అమెరికా సపోర్ట్ ఇవ్వడంతోనే ఇందిరా ఇలా చేశారని తెలుస్తోంది. అటు ఇందిరా గాంధీతో సరైన సంబంధాల లేకపోవడంతోనే హెన్రీ తర్వాతి కాలంలో చైనా వైపు మొగ్గు చూపారన్నది విశ్లేషకుల మాట. కిస్సింజర్ 1972లోనే భద్రతా మండలిలో భారత్‌, జపాన్‌ల శాశ్వత సభ్యత్వం కోసం ఫైట్ చేశారు కూడా. కానీ తర్వాతే ఇండియాతో ఆయన సంబంధాలు క్షీణించాయి.

publive-image మోదీతో హెన్రీ

మోదీ అంటే ఇష్టం:
2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హెన్రీ కిస్సంజర్‌ ఇండియాతో అమెరికా సంబంధాలను బలపేతం చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకి మోదీ అంటే చాలా గౌరవం. 2018 జూన్‌లో అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ మొదటి వార్షిక నాయకత్వ శిఖరాగ్ర సమావేశంతో హెన్రీ కిస్సింజర్ భారత్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వంలో బలమైన అమెరికా-భారత్ సంబంధాలను సమర్థించారు. ఆయనకు మోదీ అంటే ఎంత ఇష్టమంటే.. ఆరోగ్యం బాగోకున్నా ప్రధానిని చూసేందుకు వెళ్లే అంతలా. గత జూన్‌లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇచ్చిన లంచ్‌కు మోదీ హాజరయ్యారు. తర్వాత ప్రధాని ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని వినడానికి వాషింగ్టన్‌కు వెళ్లారు హెన్రీ.

Also Read: టుక్‌ టుక్‌ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు