News Education Policy : భారత విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులు రూపొందించిన అగ్రరాజ్యం..!!

భారతీయ విద్యార్థుల కోసం అమెరికా ప్రత్యేక కోర్సులు రూపొందించింది. భారత్ లో 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానానికి అనుగుణంగా భారతీయ విద్యార్థుల కోసం ఇలా ప్రత్యేక కోర్సులకు రూపకల్పన చేసింది అగ్రరాజ్యం.

New Update
News Education Policy : భారత విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులు రూపొందించిన అగ్రరాజ్యం..!!

US Masters Courses for Indian Students, : భారత విద్యార్థుల కోసం అమెరికా ప్రత్యేక కోర్సులను రూపొందించింది. భారత్ యొక్క కొత్త జాతీయ విద్యావిధానానికి (News Education Policy) అనుగుణంగా అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో ఏడాది ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి అనుమతించే విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత (STEM) విభాగాల్లో విద్యాను అభ్యసించనున్నారు. . అయితే కోర్సులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. కోర్సు పూర్తిచేసిన తర్వాత నిబంధనల ప్రకారం విద్యార్థుల మూడేళ్ల పాటు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ, చొరవను ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఇరవై అమెరికన్ , 15కి పైగా భారతీయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే చర్చలు మొదలు పెట్టాయి.

స్టేట్ డిపార్ట్‌మెంట్ దక్షిణ, మధ్య ఆసియా (SCA) బ్యూరోలో జెఫెర్సన్ సైన్స్ ఫెలో అయిన అఖిలేష్ లఖ్టాకియా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. భారతదేశం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జాతీయ విద్యా విధానం 2020 ద్వారా కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.

దీని లక్ష్యం:
1. భారతీయులందరికీ అందుబాటులో ఉంచడం.
2. ఏకకాలంలో ప్రపంచవ్యాప్త పరిధి, భారతీయ సంస్కృతి, విజ్ఞాన వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించడం.
3. విద్యార్థి, విద్యావేత్తల మధ్య భాగస్వామ్యం.

Advertisment
తాజా కథనాలు