/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/j-1-1-jpg.webp)
ambedkar konaseema: అంబెడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మలికిపురం జనసేన పార్టీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి, శ్రీనివాసుల కుమారుడు జైధిర్. మినీ వారాహి వాహనాన్ని తయారుచేసాడు. జనసేన అధినేత పవన్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. వారాహి యాత్ర సందర్భంగా రాజోలు నియోజకవర్గనికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చాడు. అదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో మినీ వారాహిని తయారుచేసి లాటరీ పెట్టాడు.
ఒక్కో టికెట్ ను 100 రూపాయలుగా నిర్ణయించి, దాని ద్వారా సుమారు రూ.2.90 లక్షలు సమకూర్చాడు. ఈ మొత్తానికి మరొక రూ.10 వేలు జమ చేసి మూడు లక్షల రూపాయల నగదును జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి పార్టీ ఫండ్ గా అందజేస్తామని జైదీర్ తెలిపాడు. రాజోలు నియోజకవర్గ నాయకులు, వీర మహిళల సమక్షంలో ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. ఈ మినీ వారాహిని రాజోలు మండలం చింతలపల్లికి చెందిన గురుజు వెంకట నరసింహారావు అనే వ్యక్తి దక్కించుకున్నారు. బుల్లి జనసైనికుడు జక్కంపూడి జైథిర్ వినుత్న ఆలోచన చూసి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మినీ వారాహిని తయారు చేయడమే కాకుండా దానితో లక్కీ డ్రా ఆలోచన చేసి వచ్చిన డబ్బును కూడా పార్టీ ఫండ్ కు ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అంటూ ఆ బాలుడిని అభినందిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)వారాహి విజయ యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. వైసీపీ పాలనపై విమర్శలు చేస్తు..చేసే తప్పులను ఎండగడుతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేస్తూ మూడు వారాహి యాత్రలను విజయవంతం చేసారు. వారాహి సందర్భంగా పవన్ చేసే కామెంట్స్ ను వైసీపీ మంత్రులు, నాయకులు అదే విధంగా కౌంటర్ ఇస్తు వచ్చారు.
కాగా, నాలుగో విడత పవన్ వారాహి విజయ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాల్లో ఐదు రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా.. నాలుగు నియోజకవర్గాలను జనసేనాని కవర్ చేయనున్నారు. యాత్రలో భాగంగా అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. 21న అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. 26వ తేదీ వరకు నాలుగు నియోజకవర్గాల్లో నిర్విరామంగా జరగనుంది.