/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambati.png)
Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 175 సీట్లు గెలుచుకొని మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓటమి చెందినట్టేనన్నారు.
Also Read: మంత్రి బుగ్గనకు కోట్ల సుజాతమ్మ సవాల్..!
ఐదు సంవత్సరాల పరిపాలన తాను చిత్తశుద్ధిగా చేసినట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పని చేశానన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నమ్మకం తనకు ఉందని కామెంట్స్ చేశారు. పలు గ్రామాల నుంచి తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Follow Us