Crusie Functions : అనంత్ అంబానీ పెళ్ళి తరువాత క్రూజ్ వేడుకలకు డిమాండ్ అనంత్ అంబానీ పెళ్ళి వేడుకలు మారుమోగనున్నాయి. వాటిల్లో పెళ్ళికి ముందు క్రూజ్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ సెర్మనీ అదిరిపోనుందని తెలిస్తోంది. దీంతో క్రూజ్‌లలో వేడుకలకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. By Manogna alamuru 03 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Crusie Functions : అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant) పెళ్ళి వేడుకలకు (Wedding Celebrations) భారత్ (India) సిద్ధం అవుతోంది. పెళ్ళిలో, దానికి ముందు చాలా వేడుకలు జరగనున్నాయి. వాటిల్లో క్రూజ్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుక అన్నింటికంటే హైలెట్ కానుంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. దీంతో భారత్‌లో క్రూజ్ వేడుకలను డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు కోర్డెలియా క్రూయిసెస్ ప్రెసిడెంట్ మరియు CEO అయిన జుర్గెన్ బైలోమ్. క్రూజ్‌లలో అన్ని సౌకర్యాలను అందించిందేకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంత్ అంబానీ పెళ్ళి తరువాత క్రూజ్ వేడుకలకే అందరూ ఆమోదం తెలుపుతారని చెబుతున్నారు. సముద్రం మీద జరిగే ఈ వేడుకలు చాలా గ్రాండ్‌గా ఉండడమే కాకుండా ఒక కొత్త లుక్‌ను కూడా ఇస్తాయని చెబుతున్నారు. భారతీయ వివాహాలను నిర్వహించేందుకు కార్డెలియా సిద్ధమయిందని జురెన్ బైలోమ్ చెప్పారు. క్రూజ్‌లో జరిగే పెళ్ళి మహోత్సవం వారి జీవితంలో గుర్తుండిపోయేలా చేస్తామని అంటున్నారు జురేన్. వధూవరులు పెళ్ళి మండపంలోకి వెళ్ళేటప్పుడు, వివాహం జరుగుతున్నప్పుడు వెనుక సూర్యుడు అస్తమించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంగీత్, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలను నిర్వహించగల రాయల్ థియేటర్లు..ప్రఖ్యాత చెఫ్‌లు, స్పా, సెలూన్ సేవలు, నాన్‌స్టాప్ వినోదం, బాణసంచా, డ్రోన్‌లు, వివాహ ఫోటోలు, వీడియోలతో పాటూ ఓడలో 400,000 ఎర్ర గులాబీలను ఉంచడం వరకు అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయని తెలిపారు. ఇక అనంత్ అంబానీ వెడ్డింగ్ తర్వాత క్రూజ్ వేడుకలకు డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు కోస్టా క్రూయిజ్‌ల కోసం లోటస్ ఏరో ఎంటర్‌ప్రైజెస్ మరియు జనరల్ సేల్స్ ఏజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నళిని గుప్తా. ఎందుకంటే అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్లకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. వారి ఇంటి సందడిని దేశమంతా చూస్తుంది. అందుకే ఇప్పుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ తర్వాత భారత్‌లో క్రూజ్ సేవలకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. ఈమధ్య కాలంలో చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు క్రూజ్ వెడ్డింగ్‌లను చేసుకుంటున్నారని...దాంతో పాటూ సోషల్ మీడియాలో కూడా దీనికి చాలా ప్రాచుర్యం వచ్చిందని తెలిపారు. థామస్ కుక్ క్రూజ్‌లకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. కరోనా కంటే ముందు ఉన్న ప్రాచుర్యం కన్నా ఇప్పుడు 40శాతం అధికమయిందని తెలిపారు. బర్త్‌డేలు, బ్యాచిలర్ పార్టీలు, బేబీ మూన్‌ల లాంటి ఫంక్షన్లకు ఇప్పటికే క్రూజ్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు అదొక ట్రెండ్‌గా మారిందని కూడా చెబుతున్నారు. అందుకే ప్రముఖ క్రూజ్ లైన్ ఆపరేటర్ రాయల్ కరేబియన్ కూడా దీని మీద ఇప్పుడు ఆసక్తి చూపుతోందని చెప్పారు. క్రూజ్‌లలో ఉన్న మరో సౌకర్యం ఏంటంటే...దేని కోసం ఎక్కడికీ తిరగనక్కర్లేదు. వెకేషన్ అంతా ఒకచోటలోనే అయిపోతుంది. దాంతో పాటూ అతిధుల వసతి లాంటి లాజిస్టిక్స్ తో పని వత్తిడి లేకుండా హాయిగా ఉండొచ్చు. ఒకసారి క్రూజ్ మేనేజ్‌మెంట్ కు పని అప్పగించేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అందుకే క్రూజ్‌లకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోందని తెలిపారు హాలిడేస్‌కు ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్ డేనియల్ డిసౌజా. Also Read:Pakistan:పాకిస్తాన్‌లో క్రీస్టియన్ మహిళ…తొలిసారిగా బ్రిగేడియర్‌గా #radhika-merchant #anant-ambani #cruise-function #wedding-celebrations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి