అంబానీ కోడలంటే మినిమమ్ ఉండాల్సిందే...రాధిక ధరించిన డ్రెస్ ఖరీదు తెలుస్తే షాక్ అవుతారు..!!

ముఖేశ్ అంబానీ..భారతదేశంలో సంపన్నులైన కుటుంబం. వీరి కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం డబ్బు సంపాదించడంలోనే కాదు..అప్పుడప్పుడు లెక్కలేనన్ని దానధర్మాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధికా మర్చంట్ తో జరిగిన విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్ధం అయినప్పటి నుంచి ఈ జంట చాలా సందర్బాల్లో కలిసి కనిపిస్తున్నారు. ఈసారి దుబాయ్ లో సందడి చేసింది ఈ జంట. అయితే ఇప్పుడు నెటిజన్ల చూపంతా ఈ జంటపై కాదు..రాధిక మర్చంట్ ధరించిన డ్రెస్ ధరపై పడింది. రాధిక ధరించిన డ్రెస్ ఖరీదు తెలుస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.

New Update
అంబానీ కోడలంటే మినిమమ్ ఉండాల్సిందే...రాధిక ధరించిన డ్రెస్ ఖరీదు తెలుస్తే షాక్ అవుతారు..!!

నేటికాలంలో ప్రతిదీ ఖరీదు అవుతోంది. కూరగాయల నుంచి కట్టుకునే బట్టల వరకు భారీగా ధరలు పెరుగుతున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఏది కొనాలన్నా జడుసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సామాన్యులు బట్టలు కొనుగోలు చేయాలంటే ముందుగా వాటిపై ఉన్న రేటును చూస్తుంటారు. అదే డబ్బున్నోళ్లకు అయితే బ్రాండ్ అవసరం. అలాంటి వాళ్లలో అంబానీ కోడలు కూడా ఒకరు. నచ్చితే చాలు కొనాల్సిందే. ధరతో అస్సలు పట్టింపు లేదు. సరిగ్గా ఇప్పుడు అంబానీ కోడలు ధరించిన డ్రెస్సు ధరపైన్నే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

publive-image

ముఖేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ లో ఆమె ధరించిన ఓ డ్రెస్సు ధర గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ డ్రెస్సు ఖరీదు తెలుస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. అక్షరాల మూడు లక్షల రూపాయలు (3లక్షలు). మరి అంబానీ కోడలంటే మినిమమ్ ఉండాలి కదా మరి. ఆ డ్రెస్సు ధర చూసిన సామాన్యులు షాక్ అవుతున్నారు. ఓ మధ్య తరగతి కుటుంబం ఏడాది సంపాదన...అంబానీ కోడలు ధరించిన డ్రెస్సు ఖరీదు. బ్లూకలర్ డ్రెస్సు ధరించిన రాధికా మర్చంట్..చూపరులను ఆకట్టుకుంది.

ప్రీమియం బ్రాండ్ డియోర్ బ్లూ కాటర్ షర్డ్ డ్రెస్ రాధికా దుస్తులను హైలెట్ చేసింది. బ్లాక్ కలర్ స్నీకర్లతో కలిసి..తన లుక్ ను మరింత క్లాస్ గా ఉంచుంది. రాధికలోని కళాత్మక ద్రుష్టికి నెటిజన్లు పడిపోతున్నారు.ఈ మధ్యకాలంలో రాధిక తన కాస్ట్యూమ్స్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం రాధిక చేతిలోని చిన్న బ్యాగు ధర గురించి తెలుసుకున్న నెటిజన్లు షాక్ కు గురయ్యారు. ఈ బ్యాగు ధర రూ. 53లక్షలవ్వడం హాట్ టాపిగ్గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు