Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో ఏ ఆహారాలు ఏ నగరం నుంచి తెప్పించారు..?

అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో వడ్డించిన వంటకాల గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. భారతీయ స్థానిక వంటకాలు నుంచి విదేశీ వంటకాల వరకు ఎన్నో ప్రత్యేకమైన రుచులు ఈ పెళ్లి విందులో వడ్డించబడ్డాయి.

New Update
Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో ఏ  ఆహారాలు ఏ నగరం నుంచి తెప్పించారు..?

Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమాలన్నీ ముగిశాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో ప్రతీ ఈవెంట్ సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా అంబానీ పెళ్ళిలో వడ్డించిన విందు, వాటి ప్రత్యేకతల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అంబానీ పెళ్ళిలో భారతీయ నగరాల నుంచి ప్రామాణికమైన స్థానిక వంటకాలు నుంచి విదేశీ వంటకాల వరకు ఎన్నో ప్రత్యేకమైన రుచులు వడ్డించబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

కాశీ చాట్ భండార్, వారణాసి

నీతా అంబానీ అనంత్- రాధికా పెళ్ళికి ముందు బనారస్ లో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ భండార్‌లో చాట్‌ను ఆస్వాదించారు. ఆమె దాని రుచికి అభిమాని అయ్యారు. దాంతో ఆమె వివాహ వారికి ఆహ్వానాన్ని ఇచ్చారు. అనంత్ అంబానీ పెళ్లిలో కాశీ చాట్ భండార్, టొమాటో చాట్, చనా కటోరి, పాలక్ చాట్, టిక్కీ , కుల్ఫీ అందుబాటులో ఉన్నాయి.

బెంగళూరు రుచి

బెంగళూరులో ఫేమ్ రామేశ్వరం కేఫ్ వంటకాలను కూడా అనంత్ పెళ్లిలో వడ్డించారు. కొబ్బరి పురాణం పొలి, పెసరట్టు దోస, తట్టే ఇడ్లీ, బోండా సూప్ , ఫిల్టర్ కాఫీ. రామేశ్వరం కేఫ్ నుంచి సర్వ్ చేయబడ్డాయి.

కోల్‌కతా ఫేమ్ గోకుల్ గౌర్మెట్

ఈ ప్రసిద్ధ స్వీట్ల దుకాణం నుంచి పలు రకాల పాపులర్ స్వీట్స్ అంబానీ పెళ్లిలో సర్వ్ చేశారు. ఇందులో రబ్డీ, గులాబ్ జామూన్, మఖా గురేర్ సందేశ్, రసగుల్లా అనేక ఇతర ఫ్యూజన్ స్వీట్లు ఉన్నాయి.

ఇండోర్ JMB క్యాటరింగ్

ఇండోర్‌లోని ఈ ప్రసిద్ధ రెస్టారెంట్ అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన వీడియోను పంచుకుంది. పెళ్లిలో గరడు చాట్, స్వీట్ పొటాటో చాట్, భుట్టే కా కీస్, చోలే టిక్కీ, పానీ పూరీ, మూంగ్లేట్, కుంకుమపువ్వు క్రీమ్ వడ మెనులో చేర్చినట్లు తెలిపింది .

బనారస్ తమలపాకు

అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌లో బనారసి రామచంద్ర చౌరాసియా తాంబుల్ భండార్‌కు చెందిన పాన్ కూడా అందించబడింది. అనేక రకాల పాన్‌లను అతిథులు ఆస్వాదించారు.

గోవా కావాటినా

అనంత్ అంబానీ వివాహ వేడుకలో చెఫ్ అవినాష్ మార్టిన్ రెస్టారెంట్ కావాటినా నుంచి గోవా వంటకాల రుచి కూడా అందించబడింది.

వారణాసి క్షీర సాగర్

బనారస్ రుచి నీతా అంబానీకి బాగా నచ్చింది. అందుకే, చాట్ , పాన్‌తో పాటు, వారణాసికి చెందిన క్షీర్ సాగర్ లాల్ పెడా, తిరంగా బర్ఫీ, మలై గిలోరీ, మలై బర్ఫీ, బనారసి లడ్డూ, ఖీర్ కదమ్, ఖోయా కేసర్ బర్ఫీ, కాజు సంగం, అజీర్ ఖాస్ ఖాస్, చంద్రకళ స్వీట్లు మెనూలో చేర్చారు.

Priyanka Chopra: 'హ్యాపీ బర్త్ డే మై లవ్'... ప్రియాంక కోసం నిక్ జోనస్ స్పెషల్ పోస్ట్ - Rtvlive.com

Advertisment