Ambani Wedding Cost: రిలయన్స్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నెలరోజుల పాటు సాగిన అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ప్రపంచ తారలు
10 రోజుల పాటు ఘనంగా ముగిసిన ప్రీ వెడ్డింగ్ వేడుకల తర్వాత ఈరోజు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. జస్టిన్ బీబర్, రిహన్నా వంటి ప్రపంచ తారలు, దిల్జిత్ దోసాంజ్ వంటి బాలీవుడ్ ప్రముఖుల ప్రదర్శనలతో అనంత్ - రాధికా పెళ్లి సంబరాలు అంబరానంటాయి.
5000 కోట్లతో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం కనీవిని ఎరుగని రీతిలో జరిపేందుకు అంబానీ కుటుంబం అత్యంత భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అనంత్ - రాధికాల వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ముఖేష్ అంబానీ దంపతులు. ఫోర్బ్స్ ప్రకారం, అనంత్ అంబానీ వివాహ మహోత్సవానికి రూ. 4,000-5,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇది అంబానీ కుటుంబ నికర విలువలో కేవలం 0.5 శాతం మాత్రమే.
Also Read: #SVC58: వెంకీ- అనిల్ మూవీ షూట్ మొదలైంది.. కోటి ఉమెన్స్ కాలేజీలో భారీ సెట్స్