Amazon: అదిరే ఆఫర్.. డొంట్ మిస్ ద ఛాన్స్.. కేవలం రూ.16వేలకే..! అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అమెజాన్ కూపన్ ఆఫర్ కలిపితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ కేవలం రూ.16,249 ధరకే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.1,143 నుంచి ప్రారంభం అవుతుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.16,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. By Trinath 16 Jul 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది గంటల్లో ముగిసిపోనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. మొబైల్స్ కొనాలనుకునే వాళ్లకి ఇదే మంచి సమయం. ఓ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.16 వేలకే సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ మొబైల్‌పై ఈ ఆఫర్ లభిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైన సంగతి తెలిసిందే. రిలీజ్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఇటీవల ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది వన్‌ప్లస్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ డే సేల్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ లిస్టింగ్ ధరలు చూస్తే 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999 ఉండగా.. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. అమెజాన్ కూపన్ ద్వారా రూ.500 తగ్గుతుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్, అమెజాన్ కూపన్ ఆఫర్ కలిపితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ కేవలం రూ.16,249 ధరకే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.1,143 నుంచి ప్రారంభం అవుతుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.16,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. స్టోరేజ్ నుంచి 5జీ ర్యామ్ పెంచుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్, ఎస్‌డీకార్డ్ సపోర్ట్, 3.5ఎంఎం జాక్, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్‌సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి