/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/person-is-talking-on-the-phone-with-a-customer-se-2023-04-17-18-41-17-utc-scaled.jpg)
ఈనెల 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోసం యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మొబైల్స్ కొనుగోలు చేయలనుకునే వాళ్లు రానున్నఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. జూలై 15 నుంచి జూలై 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. పలు మొబైల్స్‌పై డిస్కౌంట్లు ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నవారికి ఇదే సరైన అవకాశం.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ద్వారా విస్తృత శ్రేణి మోడల్‌లపై 40శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఏ మొబైల్స్‌పై ఆఫర్లు ఉన్నాయో ఓ లుక్కేయండి..!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/amazon-prime-day.jpg)
ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు :
యాపిల్ ప్రీమియం ధరలో ఐఫోన్ 14 ఫ్లాగ్షిప్ డివైజ్.. ఈ సేల్ సందర్భంగా గణనీయమైన ధరను తగ్గనుంది. కచ్చితమైన తగ్గింపు ఎంతన్నది ఇప్పటితీ స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుత ధర రూ.70,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఐఫోన్ 14ని యాపిల్ అభిమానులకు మరింత తక్కువ ధరకు అందించనుంది.
శాంసంగ్:
శాంసంగ్ M34 5G ఫోన్ కూడా విజన్ బూస్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులో షేక్ కెమెరా ఫీచర్లు లేవు. 120Hz AMOLED మాన్స్టర్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 స్క్రీన్, 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. ప్రీమియర్ 5G సెగ్మెంట్-ఫస్ట్ 108MP అల్ట్రావైడ్ మాక్రో లెన్స్, అదిరే డిజైన్, 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 108MP అల్ట్రా-వైడ్ మాక్రోలెన్స్ను ప్రదర్శిస్తుంది. ఈ మొబైల్ కూడా డిస్కౌంట్ ప్రైజ్‌లో రావచ్చు. శాంసంగ్ గెలాక్సీ M34 ఫోన్ ధర గెలాక్సీ M33 కన్నా తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ డే అనేది కొత్త మోడల్ లాంచ్, ప్రైమ్ డే సేల్‌తో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రూ.24,499 ఉండగా, సేల్ సందర్భంగా మరింత ధర తగ్గవచ్చునని భావిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/oppo-8.jpg)
ఐక్యూ 11 5G ఫోన్ :
ఐక్యూ 11 5G ఫోన్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. టెక్ ఔత్సాహికులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ సేల్ సమయంలో ఐక్యూ 11 5G ఫోన్ ధర భారీ తగ్గింపును పొందవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/oppo-5.jpg)
ఇతర ఆఫర్ వివరాలివే:
అటు ఇతర యాక్సెసరీస్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లు pTron Zenbuds Evo X1ని రూ.3,999కి బదులుగా కేవలం రూ.1,299కే ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఇది కాకుండా, కస్టమర్లు OnePlus Nord Buds 2rని రూ.2,199కి కొనుగోలు చేయవచ్చు.రూ.4,999కి బదులుగా కేవలం రూ.1,199కే గోవో గో బడ్స్‌ను ఇంటికి కొనవచ్చు . ఇది 52 గంటల ప్లేటైమ్తో వస్తుంది. అటు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అసాధారణమైన డీల్‌లు, ఫోన్లపై మరెన్నో సేవింగ్స్ పొందవచ్చు. స్మార్ట్ఫోన్లు, టీవీల నుంచి గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, కిరాణా సామాగ్రి, అమెజాన్ డివైజ్‌లు, ఇల్లు, వంటగది, ఫర్నిచర్, రోజువారీ నిత్యావసరాల వరకు, ప్రైమ్ సభ్యులు కొత్త రిలీజ్, డీల్‌లు అనేక రకాల ప్రొడక్టులపై ప్రత్యేక యాక్సస్ పొందుతారు.