ఆర్థిక మాంద్యం దెబ్బకి ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి దాపరించింది. నష్టాలు రాకుండా.. వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను పీకిపడేస్తున్నాయి. వాళ్లకేం పోయింది.. తమ కంపెనీ బాగుంటే చాలు..ఎవరు ఎటు పోయారన్నది వాళ్లకి అనవసరం. దిగ్గజ కంపెనీలైనా..చిన్నచితక కంపెనీలైనా అదే తీరు. ‘జాబ్ లేఆఫ్’ అన్నది బిజినెస్‌ని కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందన్న మాట నిజమేనైనా.. ఎన్నో ఆశలతో, పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ వచ్చిందన్న ముచ్చట మూడునాళ్లైనా తీరకముందే ఉద్యోగం ఊడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా చాలా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్‌లను కంటిన్యూ చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ మరోసారి తమ కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపించింది.
పూర్తిగా చదవండి..Layoffs: ఇది నిజంగా ఘోరం భయ్యా.. జాబ్‌లో నుంచి పీకేసి అన్ని మాటలంటారా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కారణంగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల్లో కోత పెట్టింది. అమెజాన్ ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లోని ఉద్యోగులను తొలగించింది. తమ బిజినెస్ గ్రోత్ కోసమే ఈ పని చేసినట్టు అమెజాన్ తెలిపింది.

Translate this News: