Amaravati: ఏపీ రాజధాని అమరావతే! ఆరోజు నుంచే పనులు షురూ.. 

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరోజు నుంచే అమరావతిని అధికారికంగా ఏపీ రాజధానిగా ప్రకటించి.. పనులు ప్రారంభించనున్నట్టు టీడీపీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తిచేయడమే లక్ష్యం అని వారంటున్నారు. 

Amaravati: ఏపీ రాజధాని అమరావతే! ఆరోజు నుంచే పనులు షురూ.. 
New Update

Amaravati: ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని (AP Capital) విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2తో ముగిసింది. ఇప్పుడు టెక్నీకల్ గా ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఉంది. కేంద్రం అమరావతి రాజధాని అని ఇంతకు ముందు కూడా ప్రకటన చేసింది. కానీ, గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరిట జరిగిన హంగామాలో అమరావతిలో అన్ని పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొలువు తీరుతుండగా అమరావతి రాజధానిపై మళ్ళీ చర్చ మొదలైంది. 

చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేరోజు రాష్ట్రానికి మొదటి అధికారిక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తారని చెబుతున్నారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న జాతీయ మీడియా దైనిక్ భాస్కర్ కు వెల్లడించిన వివరాల ప్రకారం అమరావతి అధికారిక రాజధానిగా 12వ తేదీ నుంచి మనుగడలోకి వస్తుంది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధానిని అభివృద్ధి చేసేందుకు దాదాపుగా 25వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అప్పటి ప్రణాళిక ప్రకారం 2034 నాటికి మొత్తం లక్ష కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం మారడంతో అమరావతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు ఇక నుంచి అమరావతి కేంద్రంగానే ప్రభుత్వం నడుస్తుందన్న సందేశాన్ని ఇవ్వడం కోసమే అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని జ్యోత్స్న అంటున్నారు. 

అమరావతి అభివృద్ధికి చంద్రబాబు అప్పటి ప్రణాళిక ఇదే..

2014లో నాయుడు సీఎం కాగానే దీనిని సింగపూర్‌ తరహాలో బ్లూ-గ్రీన్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అప్పటి నుంచి అమరావతిలోని (Amaravati) 217 కి.మీ ప్రాంతాన్ని సింగపూర్ తరహాలో బ్లూ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇందుకోసం 20 ఏళ్లలో రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలతో పాటు 144 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల కార్యాలయాలు నిర్మించాల్సి ఉంది. మొదట్లో ఆంధ్రా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా చంద్రబాబు నాయుడు రూ.50 వేల కోట్లు కేటాయించారు. అమరావతి కోసం రైతుల నుంచి భూసేకరణ కూడా పూర్తి చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరం నిర్మాణం కోసం సింగపూర్ ఆధారిత అస్కెన్డాస్-సిన్బ్రిడ్జ్, సెంకోకార్ డెవలప్మెంట్ కన్సార్టియాన్ని ప్రారంభించింది. కొత్త రాజధాని నగరం మౌలిక సదుపాయాలు, 7-8 సంవత్సరాల దశలో, 33,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని భావించారు. హడ్కో నుండి 7,500 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుండి $ 500 మిలియన్లు, భారత ప్రభుత్వం నుండి 2,500 కోట్ల రూపాయలు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 

దాదాపు 1.8 బిలియన్ డాలర్ల  పెట్టుబడితో బిఆర్‌ఎస్‌ మెడిసిటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.> ప్రతిపాదనలు ఆర్ధిక, న్యాయ, ఆరోగ్య, క్రీడ, మాధ్యమాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తొమ్మిది ఉప నగరాలు, నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, రిలయన్స్ గ్రూప్, NRDC- ఇండియా రూపొందించిన ప్రభుత్వ భవనాలు నగరంలోనే నిర్మించాలని ప్రణాళిక.  ₹ 600 మిలియన్ కోట్ల ఆరోగ్య సంరక్షణ 'బిపిఓ' మంగళగిరి ఐటి పార్కులో ప్రారంభించారు.  హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అనే ఒక ఐటి సంస్థ ఒకకేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్లాన్ చేసింది. 

Also Read: ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు.. నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్‌ రవాణా కొరకు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (HTT), అమరావతి, విజయవాడ నగరాలను అనుసంధానించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. దీనిద్వారా ప్రయాణ కాలం ఆరు నిమిషాలకు తగ్గుతుంది. సమీపంలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తెనాలి లతో అనుసంధానించిన  అమరావతి సర్క్యులర్ రైలు మార్గం 105 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు ₹10,000 కోట్ల ఖర్చుఅంచనాతో ప్రతిపాదించారు. 

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రతిపాదన చేశారు.  కర్నూలు, కడప ఫీడర్ రోడ్ల మద్దతుతో ఈ  గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి వేగవంతమైన రహదారి ప్రవేశం కల్పిస్తుంది.

అయితే, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేసి అక్కడ నుంచి పాలన ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొన్ని పనులను ప్రారంభించారు. అయితే, 2019 ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చింది. అమరావతిలో పనులను నిలిపివేసింది. ప్రజావేదికను కూల్చివేసి.. అమరావతి రాజధానిగా ఉండబోదని తేల్చేసింది. కానీ, అటు మూడు రాజధానులు ఏర్పడలేదు. అమరావతి పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 29 గ్రామాల్లోని 54 వేల ఎకరాల భూమిలో 39 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టు కోసం సేకరించారు.  ఇక్కడ నిర్మించిన భవనాలు ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉన్నాయి. 

ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో అమరావతికి పునరుజ్జీవనం వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే, ప్రజలు కూడా అమరావతి రాజధానిగా ఏర్పాటవుతుందని ఆశాభావంతో ఉన్నారు. 

#chandrababu-naidu #amaravati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe