Amaravathi: అమరావతిలో సందడి.. వేగంగా సాగుతోన్న పనులు! ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండడంతో అమరావతిలో మళ్లీ సందడి స్టార్ట్ అయ్యింది. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో చెట్ల తొలగింపును అధికారులు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం జోరుగా సాగుతోంది. By Nikhil 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీలో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి పూర్వవైభవం సంతరించుకోనుంది. అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించిన టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో విద్యుత్ దీపాల మరమ్మతు, ఏర్పాటు సైతం సాగుతోంది. పనులు తిరిగి ప్రారంభం కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రియల్ ఎస్టేట్ సైతం ఊపందుకుంది. ఇన్నాళ్లూ లక్షల్లో పలికిన ధరలు ఇప్పుడు కోట్లలోకి పెరిగిపోయాయి. బాబు ప్రమాణ స్వీకారం తర్వాత మరింత సందడి.. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో అమరావతిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే అమరావతి భారీగా నిధులు వస్తాయని ఏపీలో చర్చ సాగుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి